ఇటీవల విడుదలైన 'మిస్టర్ మజ్ను' సినిమాలో హీరోగా నటించాడు అఖిల్. ఈ సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినప్పటికీ అఖిల్ మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూ వీలైనంతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని కానీ ఇప్పుడు మానేసినట్లు వెల్లడించాడు. స్మోకింగ్ మంచి అలవాటు కాదని.. సెట్స్ లో స్మోక్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

అఖిల్ సినిమాల విషయంలో నాగార్జున ప్రమేయం ఎక్కువగా ఉంటుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. 'నాన్న సలహాలు మాత్రం ఇస్తారు.. నన్ను ఎప్పుడు కంట్రోల్ చేయరు' అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో స్మార్ట్ హీరో ఎవరని అడగ్గా.. తారక్ అని టక్కున సమాధానమిచ్చాడు.

హార్డ్ వర్క్ ఎవరు చేస్తారంటే తన అన్నయ్య నాగ చైతన్య పేరు చెప్పిన అఖిల్.. రానా దగ్గుబాటి కన్నింగ్ ఫెలో అని చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో మాస్ అంటే చిరంజీవి గారని, డాన్స్ పరంగా చూస్తే చరణ్ బెస్ట్ అని చెప్పారు. టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అంటే మహేష్ బాబు పేరు తప్ప మరొకరి పేరు చెప్పలేమని అన్నారు.