అక్కినేని నాగ చైతన్య కెరీర్ బాక్స్ ఆఫీస్ ముందు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో అఖిల్ తప్పకుండా నాన్నకు మించిన హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ మనోడి మొదటి సినిమానే దారుణంగా దెబ్బ కొట్టింది. ఇక ఆ తరువాత స్టైల్ మార్చి హలో చెప్పినా కూడా ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇక మిస్టర్ మజ్ను ఓపెనింగ్స్ మనోడి రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాయి.  

అసలు మ్యాటర్ లోకి వస్తే.. రీసెంట్ గా మజ్ను ఓపెనింగ్స్ చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. వరల్డ్ వైడ్ గా కనీసం 5 కోట్లు కూడా రాలేదు. అఖిల్ మొదటి సినిమా ఫస్ట్ డే 8 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక హలో సినిమాకు మూడున్నర కోట్ల ఓపెనింగ్ షేర్స్ అందాయి. ఇక నిన్న విడుదలైన మిస్టర్ మజ్ను మొదటిరోజు 4.35కోట్ల షేర్స్ మాత్రమే అందినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే అఖిల్ కెరీర్ ఏ ట్రాక్ లో వెళుతుందో అర్ధం చేసుకోవచ్చు. 

మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరోలే బడ్జెట్ లో సగానికి పైగా మొదటి రోజే వసూలు చేస్తుంటే అక్కినేని వారసుడు మాత్రం సగంలో సగం కూడా తేవడం లేదు. కొత్త తరహా ప్రయోగాత్మక సినిమాలు చేసి అఖిల్ మెప్పిస్తే తప్పా సక్సెస్ అందుకోలేడు. మిస్టర్ మజ్నులో అఖిల్ నటనపై కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. మరి ఈ హీరో ఫైనల్ గా మిస్టర్ మజ్నుతోఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)