Asianet News TeluguAsianet News Telugu

ఆలియానే కావాలంటున్న అఖిల్‌

  • అఖిల్ రీలాంచ్ సినిమాలో అలియా కోసం టాక్స్
  • విక్రమ్ కుమార్ సినిమా కోసం పక్కా ప్లానింగ్
  • హీరోయిన్ గా అలియానే ప్రిఫర్ చేస్తున్న అఖిల్
AKHIL TO ROMANCE WITH ALIA

కింగ్ అక్కినేని నాగార్జున వార‌సుడిగా చిన్న‌ప్పుడే వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన అఖిల్ అక్కినేని ..చిన్న వ‌య‌సులోనే హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఏ హీరోకి లేని విధంగా త‌ను న‌టించిన అఖిల్ సినిమాకు భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. ఒక ఇంట్ర‌డ‌క్ష‌న్ హీరోకి అంత క్రేజ్ చూసి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నుకున్నారంతా. కాని క‌ట్ చేస్తే ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది అఖిల్ సినిమా. 

అయితే సినిమా ప‌రంగా ఇప్ప‌టికే కోలుకోలేని దెబ్బ‌తిన్న అఖిల్‌కు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు వెంటాడుతున్నా... మ‌నోడు ఇప్పుడు ఈ విష‌యాల‌ని ప‌క్క‌న పెట్టేసి త‌న రెండ‌వ సినిమా పైనే త‌న దృష్టంతా పెట్టాడు. విక్ర‌మ్ కె కుమార్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా విష‌యంలో అఖిల్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అందుకే బాలీవుడ్ బ్యూటీ అలియాతో సీరియ‌స్ గా... చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంట చిత్ర యూనిట్. అన్ని ఫిక్స్ చేస్తే ఈ అక్కినేని అంద‌గాడి ప‌క్క‌న తెలుగు తెర‌పై త‌న అందాల‌ను ఆర‌బోయ‌నుంది అలియా. చూడాలి మ‌రి ఇంది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుందో.

అయితే ఈ సినిమాకు విక్ర‌మ్ ఫిక్స్ చేస్తున్న టైటిల్ టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అవుతోంది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు జున్ను అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నాడ‌ట. ఇందులో హీరోయిన్ ముద్దు పేరు జున్ను అంట సో అదే టైటిల్ గా ఉంటే బాగుంటుంద‌నేది విక్ర‌మ్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios