బిగ్ బాస్ హౌస్ లో నిన్న సంచలనం నమోదైంది. ఉత్కంఠగా సాగిన ఎలిమినేషన్స్ ప్రక్రియలో నాగార్జున అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్లు చివరి వరకు కథ నడిపి...ఈ వారం ఎలిమినేషన్ లేదని షాక్ ఇచ్చాడు. దీనితో అమ్మ రాజశేఖర్ మరో వారం రోజుల పాటు బిగ్ బాస్ ఇంటిలో ఉండే అవకాశం దక్కించుకున్నాడు. 

ఇక నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్స్ నామినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇంటి సభ్యులు అసలైన ఆటను కనబరిచే సమయం ఆసన్నమైనది అని బిగ్ బాస్ చెప్పడం కొంత టెన్షన్ కి గురి చేసింది. ఇక నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకున్న సభ్యుడు తలపై గుడ్డు పగలగొట్టాలని బిగ్ బాస్ చెప్పినట్లు తెలుస్తుంది. 

ఈ టాస్క్ లో ఆరియానా పై సోహైల్ విరుచుకుపడ్డాడు. ఆమె తన తలపై గుడ్డు పగలగొట్టడంతో ఆవేశానికి గురయ్యారు. ఈ ప్రక్రియలో అనూహ్యంగా మోనాల్ ని అఖిల్ నామినేట్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నామినేషన్స్ టాస్క్ లో అవినాష్ మరియు అభిజిత్ మధ్య వాగ్వాదం జరిగింది. నేను కమెడియన్, ఎంటర్టైనర్ అని అవినాష్ గట్టిగా అరవగా, మనోడికి చప్పట్లు కొట్టండి అని అభిజిత్ సెటైర్ వేశారు. 

ముఖ్యంగా అమ్మ రాజశేఖర్, అవినాష్ మధ్య సీరియస్ వార్ నడిచింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో అభిజిత్ అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. కొద్దిరోజులుగా అభిజిత్ మరియు అమ్మ రాజశేఖర్ మధ్య సరైన సంబంధాలు లేని పక్షంలో వీరిద్దరికీ హౌస్ లో పొసగడం లేదని తాజా బిగ్ బాస్ ప్రోమో ద్వారా అర్థం అవుతుంది.