అఖిల్ వరసగా పెద్ద ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం చేస్తున్న అఖిల్ మరో చిత్రం కమిటయ్యారు. మైత్రీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం తిరుపతి బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఈ సినిమాలో అఖిల్ ..ప్రక్కింటి కుర్రాడు గా క్యూట్ లుక్స్ తో సరదా సరదా గా కనిపించనున్నాడు. ఏజెంట్ చిత్రం పూర్తయ్యాక ఈ చిత్రం మొదలు కానుంది. ఆరెక్స్ 100తో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతూండటంతో ఖచ్చితంగా మంచి క్రేజ్ క్రియేట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

 అజయ్ భూపతి మహా సముద్రం సినిమా ఫినిష్ చేయాలి.  ఆ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ఈ నెలాఖరుకు పూర్తయిపోతుంది. ఆ సినిమా పూర్తయ్యాక ఈ సినిమా పనులు మొదలు పెట్టాలనుకుంటున్నారు అజయ్ భూపతి. ఈ మేరకు తన టీమ్ తో స్క్రిప్టు వర్క్ జరుగుతోందిట. ఒక్కసారి అన్ని ఫైనల్ అనుకున్నాక అఫీషియల్ ఎనౌన్సమెంట్ రానుంది. 

ప్రస్తుతం అఖిల్ నటించి,రిలీజ్ కు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్స్ చూస్తే.. మళ్ళీ బొమ్మరిల్లు లాంటి మ్యాజిక్ చేస్తాడేమో అని దర్శకుడు భాస్కర్ మీద కాస్త ఎక్సపెక్టేషన్స్ పెరిగాయి.

శర్వానంద్ - సిద్ధార్థ్  హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ . ప్రేమతో కూడిన యాక్షన్‌ డ్రామా కథగా సినిమా తెరకెక్కుతోంది. శనివారం హీరో సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రటీమ్  విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.