ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని అఖిల్ మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత చేసిన హలో సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దీంతో ప్రస్తుతం చేస్తోన్న మిస్టర్ మజ్ను సినిమాపైనే అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. 

అయితే నెక్స్ట్ టాలీవుడ్ అగ్ర దర్శకులతో అఖిల్ సినిమా చేయనున్నట్లు మొన్నటివరకు అనేక రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెట్టె విధంగా త్వరలోనే ఈ యువ హీరో స్పెషల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. తమిళ దర్శకుడు మిత్రన్ తో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 

విశాల్ తో అభిమన్యుడు సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న మిత్రన్ ఇటీవల అఖిల్ ని కలిసినట్లు తెలుస్తోంది. మిత్రన్ చెప్పిన కాన్సెప్ట్ స్టోరీ లైన్ కు అక్కినేని అఖిల్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడట. అయితే ఈ కథ పట్టాలెక్కాలంటే ముందు నాగార్జున ఒకే చెయ్యాలి. అందుకు ఫుల్ స్క్రిప్ట్ తో డాడిని కలవమని అఖిల్ దర్శకుడికి తన వివరణ ఇచ్చినట్లు సమాచారం.