హలోకు హిట్ టాక్.. కానీ వసూళ్లలో ఫెయిల్.. లెక్కతప్పింది

First Published 30, Dec 2017, 7:20 PM IST
akhil hello got hit talk but no collections
Highlights
  • అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో
  • నాగార్జున నిర్మించిన ఈ మూవీకి హిట్ టాక్ , వసూళ్లు బ్యాడ్

అక్కినేని అఖిల్ తొలి మూవీ అఖిల్ ఫెయిల్ కావటంతో... రెండో మూవీ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుని హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మనం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన హలో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు.

 

చెప్పినట్లుగానే భారీ పబ్లిసిటీ, స్టంట్స్, రిచ్ టేకింగ్ తో ఫీల్ గుడ్ మూవీనే అందించారు. కానీ నాని ఎంసీఏ కూడా హలోకి పోటీగా రిలీజ్ కావటంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడినట్లు స్వయంగా అఖిల్ వెల్లడించాడు. పాజిటివ్ టాక్ రావటమే గగనమైపోయిన ఈ రోజుల్లో ఇలా పాజిటివ్ టాక్ రావటం శుభపరిణామమని చెప్పాలి.

 

కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.32 కోట్లు పలికాయి. మొదటి వారం రూ.11కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది. అదీ నైజాం ఏరియాలో బాగానే వచ్చినా రాయలసీమ, ఆంధ్రాలో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం షేర్ కేవలం రూ.16కోట్లు మాత్రమే. చిత్రం హిట్ అనిపించుకోవాలంటే ఇంకా మిగతా సగం వసూళ్లు సాధించాల్సివుంది.

 

ఈ వారం రిలీజైన సినిమాల ప్రభావం కొంత పడుతున్నా... ఎంసీఏ ఎఫెక్ట్ బాగా పడుతోంది. అయితే పాజిటివ్ టాక్ నేపథ్యంలో మిగతా కలెక్షన్స్ కూడా రాబడుతుందా అనే అంచనాలున్నాయి. అయితే అదంత ఈజీగా అనిపించట్లేదు. దీంతో హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా దెబ్బతిన్న సినిమాగా హలో మిగిలిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

loader