అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేశారు. చాలా మంది హీరోల వారసులతో పోల్చుకుంటే అఖిల్ చూడడానికి అందంగా ఉండడంతో పాటు డాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేయగలడు. కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నాడు.

ఇప్పటివరకు హీరోగా అతడు చేసిన మూడు సినిమాలు సరైన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదు. మొదట హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకున్నారు.

ఆమె కూడా అంగీకరించింది. కానీ ఆఖరి నిమిషంలో సినిమా నుండి తప్పుకుంది. పోనీ రష్మికని హీరోయిన్ గా తీసుకుందామంటే.. ఆమె ప్రస్తుతం చాలా బిజీగా  ఉంది. సో.. కాల్షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుంది. ఫైనల్ గా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకి ఆమె ఎంత డిమాండ్ చేసిందో తెలుసా.. అక్షరాలా.. రూ.3.5 కోట్లు.. దీంతో మొదటి గీతాఆర్ట్స్ వెనక్కి తగ్గింది. కానీ అఖిల్ ఒత్తిడి తీసుకురావడంతో ఒప్పుకోక తప్పలేదు. త్వరలోనే పూజాహెగ్డే సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వాల్మీకి', 'అల వైకుంఠపురం' వంటి చిత్రాల్లో నటిస్తోంది.