రెండు వారాల క్రితం పోతూ పోతూ నోయల్‌ ఇంటి సభ్యుల్లో అవినాష్‌, అమ్మా రాజశేఖర్‌లను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. వారిపై ఓ రేంజ్‌లో విమర్శలు చేశాడు. పూర్తి నెగటివ్‌గా మార్చేశాడు. ఇప్పుడు అఖిల్‌ కూడా అదే చేశాడు. ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ చేసిన కారణంగా, తాను డిఫెన్స్ చేయకుండా వెళ్ళిపోయిన కారణంగా అఖిల్‌ని ఎలిమినేట్‌ చేస్తున్నట్టు నాగ్‌ చెప్పారు. 

ఇక హౌజ్‌ నుంచి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు. రెండు ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌లు ఇచ్చాడు. ఆ రెండు సోహైల్‌, మోనాల్‌కి కట్టాడు అఖిల్‌. సోహైల్‌ తనకు తమ్ముడి లాంటి వాడని చెప్పాడు. తాను సీక్రెట్‌ రూమ్‌లో ఉన్నప్పుడు తన కోసం బాధపడిన ఏకైక వ్యక్తి సోహైల్‌ అని చెప్పాడు. మోనాల్‌ చాలా మంచి అమ్మాయి అని, అభిజిత్‌ ఎంత ఛీ కొట్టినా.. అతని పాజిటివిటీని కోరుకుందని, టాప్‌ ఫైవ్‌లో ఉంటావని చెప్పిందని పేర్కొన్నాడు. 

శత్రువుల గురించి చెబుతూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు అఖిల్‌. అభిజిత్‌, హారిక, లాస్య, మెహబూబ్‌ తనకు శత్రువులని, అరియానా, అవినాష్‌ న్యూట్రల్‌ అని చెప్పాడు. అభిజిత్‌ తనపై వాడిన సింపథీ, ఫేక్, బఫ్‌ వంటి పదాలను చెబుతూ సీరియస్‌ అయ్యాడు. తన దృష్టిలో చాలా పడిపోయావని విమర్శించాడు. పచ్చకామెర్లు వచ్చినోడికే మొత్తం పచ్చగా కనపడుతుందట. అలా ఒక ఫేక్ పర్సన్‌కి కనబడుతుంది. నువ్వు ఫేక్ అయితేనే వేరే వాళ్లు నీకు ఫేక్‌లా కనిపిస్తారని అభిజిత్‌పై మండిపడ్డాడు. 

హారిక విషయంలోనూ సింపథీ కార్డ్స్ ఎప్పుడూ పనిచేయదని, తాను దాన్ని వాడుకుంటుందని విమర్శించాడు. హారిక తనని హేట్‌ చేసిందని చెప్పాడు. అసలు తనని ఎప్పుడు లవ్‌ చేశావని ప్రశ్నించాడు. లాస్యని సైతం విమర్శించాడు. ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరవాత అతనిపై జోక్స్ వేస్తారని అస్సలు అనుకోలేదని అన్నాడు. లాస్య నవ్వుకుంటూ జోకులు వేసిందని, దాని వల్ల తాను ఎంత బాధగా ఫీలై ఉంటానని ఒక్కసారి ఊహించుకోండని పేర్కొన్నాడు. మెహబూబ్‌ విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్ గురించి తాను చేసింది చెప్పాడు. అది మార్చుకోవాలని తెలిపాడు. మొత్తానికి అఖిల్‌ ఈ ముగ్గురిని చెడుగుడు ఆడుకున్నాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ ఉంటున్న విషయం తెలిసిందే.