మోనాల్ కేంద్రంగా అఖిల్-అభిజిత్ ల మధ్య నడిచే వివాదం గురించి తెలిసిందే. హౌస్ లో వీరిద్దరూ పైకి మిత్రులుగా కనిపించినా లోపల మాత్రం ఆమె కోసం పోటీపడుతూ ఉంటారు. మోనాల్ ఒకరికి దగ్గరైనప్పుడు మరొకరు నొచ్చుకుంటూ ఉంటారు. హౌస్ లో మోనాల్-అఖిల్ లవ్ డ్రామా హైలెట్ అయినప్పటికీ అభిజిత్ యాంగిల్ కూడా ఆసక్తి రేపుతుంది. మోనాల్ అప్పుడప్పుడు అభిజిత్ తో కూడా సన్నిహితంగా ఉంటుంది. అయితే కొద్దిరోజులుగా మోనాల్ పై అభిజిత్ మండిపడుతున్నారు. తన ప్రవర్తన నచ్చలేదన్న అభిజిత్, ఈవారం నామినేట్  జరిగింది. 


అయితే అభిజిత్ తో వచ్చిన విభేదాలు క్లియర్ చేసుకోవాలని మోనాల్ రోజూ ప్రయత్నిస్తుంది.ఆ అందుకే అవకాశం వచ్చినప్పుడు అతనితో డిస్కషన్స్ పెడుతుంది. తాజాగా వీరిద్దరూ మళ్లీ ఇదే విషయంపై చర్చించుకున్నారు. నువ్ ఐ లైక్ యూ చెప్పావ్.. ఆ తరువాత నన్ను మ్యానిప్యులేటర్ అన్నావ్.. నాగార్జున ముందు ఇద్దరిదీ తప్పు అని చెప్పావ్ అని పాత గొడవల్ని మళ్లీ ప్రస్తావించాడు అభిజిత్.

వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుండగా అఖిల్ వచ్చి ఇన్వాల్వ్ కావడం జరిగింది.  ‘అభి నువ్ ఇప్పుడు చెప్తున్న పద్దతిలో అప్పుడు చెప్పి ఉంటే మోనాల్ అర్థం చేసుకుని ఉండేది.. కానీ నీ టోన్ అప్పుడు డిఫరెంట్‌గా ఉంది.. అందుకే ఆమెకు తప్పుగా అర్థమైంది’ అంటూ కూల్‌గా అభితో మోనాల్‌కి క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశాడు అఖిల్.

అయితే అభి మాత్రం వెనక్కి తగ్గలేదు.. ‘మోనాల్‌కి అలా అర్థమైతే నేను ఆమెకు క్షమాపణ చెప్పాలని లేదు.. నా గురించి నేను మాట్లాడుకోవడానికి నాకు హక్కు ఉంది. ఆమె హర్ట్ అయ్యిందంటే నేను హర్ట్ చేయలేదు.. కానీ మోనాల్ వల్ల నేను హర్ట్ అయ్యా.. నేను నీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఇద్దరం ప్రశాతంగా ఉందాం.. ఈ విషయం ఎక్కడెక్కడికో వెళిపోయింది.. ఇక్కడితో ఇది క్లియర్ చేసుకుందాం’ అంటూ మోనాల్, అఖిల్ దగ్గర నుంచి లేచి వెళ్లిపోయాడు అభిజిత్.