అక్కినేని యువ హీరో అఖిల్ మరోసారి తడబడ్డాడు. అఖిల్ మొదటి రెండు సినిమాలు ఎలాంటి నష్టాలనైతే మిగిల్చాయో రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా డబుల్ డిజాస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. 20 కోట్ల బడ్జెట్ పెడితే కనీసం సగం వసూళ్లను కూడా రికవర్ చేయలేకపోతున్నాడు. 

అందుకే ఇప్పుడు బయటి నిర్మాతలు మనోడి సినిమాకు హై బడ్జెట్ పెట్టలేకపోతున్నారు. నెక్స్ట్ అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా ఎండ్ అయ్యాయి. జులైలో సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ ప్లాన్ వేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ మొదటి నుంచి ఈ కాంబో పై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అయితే రీసెంట్ గా సంస్థ అధినేత అల్లు అరవింద్ నాగార్జునతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సినిమా కోసం 25 కోట్లు ఖర్చవుతుందని అఖిల్ పై అంత రిస్క్ చేయలేమని డైరెక్ట్ గా నాగ్ తో చెప్పేశారట. 

చేసేదేమి లేక బ్యాక్ గ్రౌండ్ లోనే నాగ్ గీత ఆర్ట్స్ తో కలిపి సగం బడ్జెట్ ని తానే భరిస్తాను అని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కొడుకుకి ఎలాగైనా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ దక్కాలని ఎంత ఖర్చైనా తాను భరిస్తాను అని నాగ్ మాటిచ్చినట్లు సమాచారం. అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ నుంచి అఖిల్ కి మంచి హిట్ దక్కాలని ప్లాన్ చేస్తున్నాడు.