నాగ్‌ సన్‌డేని ఫన్‌డేగా మారుస్తుంటారు. అయితే ఈ ఆదివారాన్ని మరింత ఫన్‌డేగా మార్చబోతున్నారు. కామెడీ, ఫన్నీ టాస్క్ లతో బిగ్‌బాస్‌ అభిమానులను విపరీతంగా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇది ఆద్యంతం కామెడీగా సాగింది. మొదట నోయల్‌ నిన్నటి ఎపిసోడ్‌లో తమపై అబండాలు వేయడంతో అవినాష్‌, అమ్మా రాజశేఖర్ ఆ వేడిలోనే రగిలిపోతున్నారు. దాన్ని కూల్‌ చేస్తానని నాగ్‌ చెప్పాడు.

ఫన్నీ టాస్క్ ల్లో భాగంగా హౌజ్‌ సభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టి డాన్స్ చేయించారు. ఇందులో సోహైల్‌, మోనాల్‌ తమదైన డాన్స్ తో మెప్పించారు. విశేషంగా ఆకట్టుకున్నారు. హారిక, అమ్మా రాజశేఖర్‌ లు నాగార్జున సినిమా సాంగ్‌కి డాన్స్ చేసి అలరించారు. హౌజ్‌మేట్‌లను ఇమిటేట్‌ చేసేలా మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్‌, మోనాల్‌ మధ్య సన్నివేశాలు రక్తికట్టాయి. 

శనివారం విలన్‌ టాస్క్ లో భాగంగా అరియానా అమ్మ అయితే అవినాష్‌.. ఆమెని చాక్లెట్‌ ఎలా అడుగుతావో చేసి చూపించమన్నాడు. ఇందులో అవినాష్‌ రెచ్చిపోయాడు. చాక్లెటే కాదు, ముద్దు కూడా అడిగాడు. కానీ అరియానా పెట్టలేదు. ఆమెని ఎత్తుకోబోగా నాగ్‌ వద్దు అన్నాడు. ఇక ఆదివారం దాన్ని అఖిల్‌ ఇమిటేట్‌ చేశాడు. మోనాల్‌ దగ్గరికి వెళ్లి కిస్‌ ఇవ్వమని అడిగాడు. ఆ సమయంలోనే పక్కన ఉన్న అరియానా, అవినాష్‌ దగ్గరకు రాగా, నాకు మోనాల్‌ కిస్‌ ఇస్తానంటే వద్దూ అంటున్న అని అఖిల్‌ మాట మార్చారు. 

పక్క ఉన్న అరియానా..అవినాష్‌ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్‌ నాకు కిస్‌ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ అఖిల్‌(అవినాష్‌) మాట మారుస్తాడు. అచ్చం అవినాష్‌ చేసినట్లే అఖిల్‌ చేయడంతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జుక కూడా పగలపడి నవ్వాడు. అలాగే హారిక లాగా అవినాష్‌ ఇమిటేట్‌ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్‌ మాస్టర్‌లాగా సోహైల్‌, అవినాష్‌లు ఇమిటేట్‌ చేస్తూ కోపంలో మాస్టర్‌ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్‌ చేసిన అవినాష్‌.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు. అభిజిత్‌ని మరోసారి పులిలా గమనిస్తుంటావ్‌ అని నాగ్‌ అనడం వంటి సన్నివేశాలు చూస్తుంటే కామెడీగా సాగుతుంది ఈ ఆదివారం అని తెలుస్తుంది. 

అంతేకాదు కాదు చివర్లో అరియానా, మోనాల్‌, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌ ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌లో ఉన్నారు.  హౌజ్‌లో సభ్యులు తగ్గుతుంటే టెన్షన్‌ పెరుగుతుందని నాగ్‌ అన్నారు.  మరి వీరిలో ఎవరు హౌజ్‌ నుంచి బయటకు వెళ్తారనేది ఉత్కంఠ నెలకొంది. అమ్మా రాజశేఖర్‌ వెళ్లే ఛాన్స్  ఉందని అంటున్నారు.