బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 47వ రోజు ఇంటి సభ్యులకు పెద్ద టాస్క్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. `బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌` అంటూ ఓ సినిమా తీయాలని, ఈ దసరాకి ఆడియెన్స్ కి వినోదాన్ని పంచాలని టాస్క్ పెట్టాడు. అందులో భాగంగా సినిమా తీయడం ప్రారంభించారు. ఇందులో అఖిల్‌, మోనాల్‌ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. వీరిద్దరి మధ్య లవ్‌ సీన్‌ని ఆద్యంతం రక్తికట్టించారు. 

ఇప్పటికే 46వ రోజు ఎపిసోడ్‌లో అఖిల్‌, మోనాల్‌ మధ్య పెద్ద డ్రామా సాగింది. అఖిల్‌కి ఓ కట్టు కథ చెప్పింది మోనాల్‌. తనకు ఇప్పటికే పెళ్లయిందని, తన భర్త యాక్టర్‌ అని, అన్ని భాషల్లో చేస్తారని, గుజరాతీకి చెందిన వ్యక్తి అని తెలిపింది. ఆయన ఎప్పుడు ట్రావెలింగ్‌ చేస్తారని, ప్రస్తుతం టూర్‌ ఉన్నారని, తాను గర్బవతి కావడంతో ఇంటి వద్దే ఉన్నానని అఖిల్‌కి చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడియెన్స్ తోపాటు అఖిల్‌ చెవిలో పూలు పెట్టింది. 

అయితే 47వ రోజు సినిమా షూటింగ్‌లో భాగంగా మోనాల్‌, అఖిల్‌ మధ్య లవ్‌ సీన్‌లో మాత్రం రియల్‌ లవర్స్ లాగా రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరి ప్రేమని చాటుకున్నారు. నిజమైన లవర్స్ లాగా చేసి అందరి చేత చప్పట్టు కొట్టించుకున్నారు. అంతే కాదు తమ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, పెళ్ళికి రావాలని అవినాష్‌, అరియానాలను ఆహ్వానించడం విశేషం. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్‌ క్లోజ్‌ అయ్యింది. మొత్తంగా అఖిల్‌, మోనాల్‌ మధ్య ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడుతుందని వేరే చెప్పక్కర్లేదు.