అఖిల్ తో యువీ క్రియేషన్స్ 100 కోట్ల సినిమా.. ఆ డైరెక్టర్ తో ఇంత రిస్కా?
ఎలాగైనా భారీ హిట్ కొట్టి టాలీవుడ్ లో తన ముద్ర బలంగా వేయాలనే కసి అఖిల్ లో కనిపిస్తోంది. ఆ స్థాయిలో కష్టపడుతున్నాడు. కానీ అదృష్టం కలసి రావడం లేదు.

ఎలాగైనా భారీ హిట్ కొట్టి టాలీవుడ్ లో తన ముద్ర బలంగా వేయాలనే కసి అఖిల్ లో కనిపిస్తోంది. ఆ స్థాయిలో కష్టపడుతున్నాడు. కానీ అదృష్టం కలసి రావడం లేదు. ఇప్పటి వరకు నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు నిరాశపరిచాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది.
భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం పదిశాతం కూడా వసూళ్లు రాబట్టలేదు. అఖిల్ తన తొలి విజయం త్వరగా అందుకోవాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అఖిల్ 6వ చిత్రం గురించి క్రేజీ బజ్ మొదలయింది. అఖిల్ 6వ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ షాక్ ఇస్తున్న అంశం ఏంటంటే ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సంస్థ ఏకంగా రూ 100 కోట్ల బడ్జెట్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా.. రిస్క్ కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు ఏది అఫీషియల్ కాలేదు.
కింగ్ నాగార్జున ప్రస్తుతం నా సామిరంగా మూవీతో, బిగ్ బాస్ 7తో బిజీగా ఉన్నారు. వీటి నుంచి బయటకి వచ్చాక నాగార్జున జనవరిలో ఫైనల్ స్క్రిప్ట్ వింటారట. అప్పుడే ఫైనల్ డెసిషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా యువి క్రియేషన్స్ సంస్థ అఖిల్ తో సినిమా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.