Akhil Agent postponed: అక్కినేని అభిమానులకు షాక్, అఖిల్ ఏజెంట్ రిలీజ్ వాయిదా..?
తమ అభిమాన తార సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు చేదువార్త తప్పేట్టు లేదు. అఖిల్ ఎంతో కష్టపడి చేస్తున్న ఏజెంట్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తమ అభిమాన తార సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు చేదువార్త తప్పేట్టు లేదు. అఖిల్ ఎంతో కష్టపడి చేస్తున్న ఏజెంట్ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు అక్కినేని నట వారసుడు అఖిల్. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ చిత్రం అఖిల్‌కు మాత్రం కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు యంగ్ స్టార్.
ప్రస్తుతం వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్. అఖిల్ ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. 8 ప్యాక్ తో అమ్మాయిల కలల రాకుమారుడిలా తయారయ్యాడు. కండలు తిరిగిన దేహంతో అఖిల్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఇక సినిమాలో అఖల్ రా ఏజెంట్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏజెంట్ చిత్రం విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈసినిమా రిలీజ్ వాయిదా పడటానికి అనేక కారణాలే ఉన్నాయి.ఇదే టైమ్ కు చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరో వైపు అఖిల్‌కు ఈ మధ్య చిన్న గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది.
మరోవైపు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో... షూటింగ్‌కు చాలా టైమ్ తీసుకోవల్సి వస్తోంది. . దాంతో అనుకున్న టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుందో లేదో అన్న అనుమానంతో మూవీ టీమ్ బాగా ఆలోచించి సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్టు తెులస్తోంది. . దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానున్నట్టు సమాచారం.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. అఖిల్ లుక్స్ కు భారీగా స్పందన వచ్చింది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈసినిమాపై నమ్మకంగా ఉన్నారు.