అఖిల్‌ అక్కినేని కొత్త సినిమా కోసం అదిరిపోయే మేకోవర్‌తో కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా పంచుకున్న కండలు తిరిగిన దేహంతో కూడిన పోస్టర్‌ వైరల్‌ అవుతుంది. 

అఖిల్‌ అక్కినేని మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. ఆయన సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న `ఏజెంట్‌` సినిమా కోసం కండలు తిరిగిన దేహంతో సందడి చేయబోతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ కష్టపడుతున్నాడు. దీంతో మొత్తానికి గూస్‌బమ్స్ తెప్పించేలా బాడీ మేకోవర్‌ని రీచ్‌ అయ్యాడు. తాజాగా ఈ లుక్‌ని పంచుకున్నాడు దర్శకుడు సురేందర్‌రెడ్డి. జిమ్‌లో కండల్ని మెలి తెప్పి బ్యాక్‌ నుంచి తీసిన అఖిల్‌ ఫోటోని పంచుకున్నారు. 

Scroll to load tweet…

`ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఉంది పండగ` అంటూ `ఏజెంట్‌ లోడింగ్‌. వైల్డ్ రైడ్‌కి మీరు సిద్ధంగా ఉన్నారా` అంటూ ట్వీట్‌ చేశారు సురేందర్‌రెడ్డి. ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే పోస్టర్‌లో అఖిల్‌ వీపుపై గాంభీరంగా పొటేల్‌ ముఖం టాటూ మరింత ఆకట్టుకుంటుంది. ఎప్పుడూ చూడనటువంటి బాడీ మేకోవర్‌ కోసం అఖిల్‌ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని ఈ నెల 12(రేపు-సోమవారం) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం అఖిల్‌ `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.