మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అక్కినేని అఖిల్...ఆతరువాత కూడా సక్సెస్ మిస్ అవ్వద్దు అని పట్టుదలో ఉన్నాడు. అందుకే ఏజంట్ కోసం చాలా కష్టపడుతున్నాడు అఖిల్. 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అక్కినేని అఖిల్...ఆతరువాత కూడా సక్సెస్ మిస్ అవ్వద్దు అని పట్టుదలో ఉన్నాడు. అందుకే ఏజంట్ కోసం చాలా కష్టపడుతున్నాడు అఖిల్. 

అఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఏజెంట్  సెట్స్ పై ఉంది. గ్యాప్ లేకుండా షూటింగ్ చేసుకుంటున్నారు టీమ్. వక్కంతం వంశీ అందించిన కథతో ఈ సినిమాను సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమా కోసం మరోసారి పక్కా ప్లాన్ తో పనిచేస్తున్నారు టీమ్. ఇక సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ వైజాగులో జరుగుతోంది. అక్కడి రోడ్లపై అఖిల్ తో పాటు మెయిన్ విలన్స్ కు సంబంధించిన    యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. అంతే కాదు ఈ సీన్ పైనే ఇంట్రవెల్ బ్యాంగ్ రానుందని సమాచారం. ఈ సినిమాకోసం అఖిల బాగా కష్టపడుతున్నాడు అఖిల్. మునుపెన్నడూ లేని విధంగా మేకోవర్ అయ్యాడు అఖిల్. 8 ప్యాక్ బాడీతో.. హ్యాడ్సమ్ లుక్ ఇస్తున్నాడు అఖిల్. మాస్ ఎలిమెంట్స్ కూడా స్పస్టంగా కనిపిస్తున్నాయి అఖిల్ లుక్ లో. ఇక ఈ లుక్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. 

 ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ధ్రువలో చరణ్ ను చాలా స్టైలీష్ గా చూపించాడు. ఈ సినిమాలో  కూడా అఖిల్ ను అంతే స్టైల్ గా చూపించనున్నాడని తెలుస్తోంది. అఖిల్ సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ సినిమాతో ఈమె తెలుగు తెరకి పరిచయం కానుంది. అంతే  కాదు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి  ఏజెంట్ సినిమాలో కీలక  పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 12 న రిలీజ్ చేయబోతున్నారు.