సాధారణంగా  కొత్త సినిమాలు ఎగ్రిమెంట్ ప్రకారం ఐదు  వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది. 


అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ఇరవై రోజులు క్రితం అంటే ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ వచ్చింది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. ఫస్టాఫ్ ఓకే అనుకున్నా సెకండాఫ్ చూడటం కష్టం అని తేల్చేసారు.ఎవరేమన్నా బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. అయితే రెండో రోజు నుంచే డ్రాప్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో నెగిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవటంతో వీకెండ్ చూద్దామనుకున్న వాళ్లు కూడా ఆగిపోయారు. చాలా మంది ఓటిటిలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఓటిటిలో రిలీజ్ డేట్ పై అఫీషియల్ ప్రకటన వచ్చింది.

అఖిల్ ఏజెంట్ మూవీ మే 19న సోనిలివ్ ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అఫీషియ‌ల్‌గా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయిన‌ట్లు తెలుస్తోంది. శుక్ర‌వారం సోనిలివ్‌లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. దాంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాను మ‌రో వారం పాటు పోస్ట్‌పోన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను సోనిలివ్ 11 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

సాధారణంగా కొత్త సినిమాలు ఎగ్రిమెంట్ ప్రకారం ఐదు వారాల తర్వాత స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సమ్మర్ హాలిడేస్ ఉండటం వల్ల ఓటీటీల వ్యూయర్ షిప్ బాగుంటుంది. అందుకోసమే సాధ్యమైనంత త్వరగా ఓటీటీ సంస్థలు.. తాము కొనుగోలు చేసిన సినిమాలను స్ట్రీమింగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. థియేటర్స్ లో ఏజెంట్ కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో పాటు ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చనుండగా ఈ మూవీ ప్లాప్ బాధ్యత మొత్తం తమదే అని ఇటీవల నిర్మాత అనిల్ సుంకర అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. అఖిల్ కూడా సారి చెప్పాడు. 

దాదాపు ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవ‌లం ఆరు కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. ఇందులో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించ‌గా సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించింది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై అనిల్ సుంక‌ర ఈ సినిమాను నిర్మించారు.



చిత్రం కథేమిటంటే..

 రామకృష్ణ అలియాస్ రిక్కీ అలియాస్ వైల్డ్ (అక్కినేని అఖిల్) కి ఒకటే జీవితాశయం. అది ఇంజిలిజెంట్ వింగ్ అయిన రా ఏజెంట్ అవ్వాలని.ఆ క్రమంలో తాను రా ఏజెంట్ అవ్వడానికి చేసే ప్రతీ ప్రయత్నం ఫెయిల్ అవుతూంటుంది.చివరగా తన అతి తెలివి ను ఉపయోగించి 'రా' చీఫ్ డెవిల్ అలియాస్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్స్ ని హ్యాక్ చేసి అతని దృష్టిలో పడతాడు. ఆ సమయంలో డెవిల్...ఓ స్పై ఆపరేషన్ సన్నాహాల్లో ఉంటాడు. గాడ్ అలియాస్ ధర్మ (డినో మోరియా) దేశానికి వినాశనంగా తయారయ్యాడని అతన్ని కంట్రోలు చేసేందుకు తన ఏజెంట్స్ ని పంపుతూంటాడు. కానీ వాళ్లెవరూ సక్సెస్ కారు. అప్పుడు డెవిల్ కు ఓ ఆలోచన వస్తుంది. దాదాపు కోతిలా ఎప్పుడు అల్లరి చేస్తూ స్పై అవ్వాలనే ఆలోచనలో ఉన్న రిక్కీని ... స్పైగా ..గాడ్ ని నాశనం చేయటానికి పంపుతాడు. ఆ మిషన్ లో రిక్కీ సక్సెస్ అయ్యాడా..అసలు స్పై అవ్వాలని రిక్కీ అలోచనల వెనక అసలు కథేంటి... డెవిల్ గాడ్ మధ్యలో ఎవరు గెలిచారు? చివరికి ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..