కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 28 న ఏజెంట్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 


ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ నెలాఖరుకు రిలీజ్ అవుతోంది ఏజెంట్ సినిమా. అయితే ఎక్కడా ఈ చిత్రానికి క్రేజ్ కనపడటం లేదు. ప్రమోషన్స్ ఊపు అందుకోవటం లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి మీడియాలో రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రం కొనడానికి బయ్యర్లు ఉత్సాహం చూపించటం లేదంటున్నారు. ఈ సినిమా మొదట ఆంధ్రా కు 30 కోట్ల నుంచి 35 కోట్లకు బిజినెస్ రేట్లు కోట్ చేసారని అప్పుడు బయ్యర్లు చాలా ఉత్సాహం చూపించారని , కానీ ఇప్పుడది లేదు అంటున్నారు. 17 కోట్ల చెప్తున్నా ఇంకా బయ్యర్లు రేటు తగ్గించమని అడుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడుతోంది. అందుకు కారణం టీజర్ రిలీజ్ అయ్యాక క్రేజ్ పెరగాల్సింది పోయి తగ్గటమే అంటున్నారు. దాంతో నిర్మాత పై బాగా ఫైనాన్సియల్ ప్రెజర్ పడిందని అంటున్నారు.

ఇప్పటికే అనుకున్నదాని కంటే రెట్టింపు బడ్జెట్ అయ్యిందని చెప్తున్నారు. సినిమా ఎంత బాగా వచ్చినా పబ్లిసిటి సరిగ్గా లేకపోవటం, బజ్ క్రియేట్ కాకపోవటం మైనస్ అంటున్నారు. దసరా చిత్రానికి ఓ పోస్టర్ తో, టీజర్ తో బిజినెస్ చేసేసారని, ఇక్కడ రివర్స్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు ప్రచారం చేయడానికి టైమ్ తక్కువగా ఉంది. పాన్ ఇండియా సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేంత టైమ్ లేదు. కాబట్టి ఇంత తక్కువ టైమ్ లో ఎంత పకడ్బందీగా సినిమాకు ప్రచారం కల్పించామనేది ముఖ్యం.

ఇదిలా ఉంటే చిత్రం టీమ్ లిరికల్ వీడియోస్ విడుదల చేస్తున్నారు. అవే ఈ సినిమా కొంప ముంచుతున్నాయంటున్నారు. సినిమాకు హైప్ తీసుకురావాల్సిన లిరికల్ వీడియోస్, సినిమాపై అంచనాల్ని తగ్గించేస్తున్నాయి. ఏమాత్రం ఆసక్తి రేకెత్తించడం లేదు ఏజెంట్ పాటలు. హిపాప్ తమిళ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రం దర్శక,నిర్మాతలు మీడియా ముందుకు ఎప్పుడొస్తారో, ఇతర ఫంక్షన్లు ఎప్పుడు చేస్తారో అనే క్లారిటీ రాలేదు. 28న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనీల్ సుంకర నిర్మాత. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయమౌతోంది. కాకపోతే సినమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. సురేంద్రరెడ్డిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే సినిమా అంటున్నారు. అదే జరిగితే అంతకు మించి కావాల్సింది ఏముంది.