బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, ‘అఖండ’ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు. 

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తాచాటుతూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసింది. అయితే థియోటర్ లో అంత పెద్దగా హిట్టైన సినిమా ఓటిటిలో మళ్లీ ఎవరు చూస్తారని చాలా మంది అన్నారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేసింది.

గతేడాది నుండి అన్ని రకాల ఓటీటీ ప్లాట్‌ఫాంలు, డిజిటల్ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ అయిన సినిమాలను పరిశీలించగా.. సౌత్ ఇండియాలోనే ఓటీటీలో టాప్ పర్ఫార్మర్‌గా అఖండ నిలిచిందని సమాచారం. ఈ మేరకు త్వరలో అఫీయల్ గా ఓటిటి సంస్ద ప్రకటిస్తుందని తెలుస్తోంది.

 ఓటీటీలోనూ బాలయ్య నటించిన చిత్రానికి ‘అఖండ’మైన రెస్పాన్స్ దక్కడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా, థమన్ సంగీతం బాక్సులు బద్దలుకొట్టింది.

 బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, ‘అఖండ’ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు.

 కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని కలెక్షన్లను నమోదు చేసుకొని ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.