Akhanda: హిందీలో `అఖండ` రిలీజ్ అప్డేట్.. నార్త్ లో బాలయ్య మాస్ జాతర షురూ!
బాలకృష్ణ నటించిన `అఖండ` ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమాలో హిందీలో రిలీజ్ కాబోతుంది. అక్కడ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ `అఖండ` రెండేళ్ల క్రితం వచ్చి తెలుగులో ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. నూటయాభై కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బోయపాటి టేకింగ్, బాలయ్య డబుల్ ధమాకా వెరసి సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా నార్త్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఎట్టకేలకు హిందీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది యూనిట్.
హిందీలో డబ్ చేసిన రిలీజ్ చేసేందుకు పెన్ స్టూడియోస్ నార్త్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ చేయబోతుంది. జనవరి 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. రేపు హిందీ ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ట్రెండింగ్‌లో ఉంది. బాలయ్య మాస్ జాతర ఇకపై నార్త్ లోనూ సాగబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కరోనా ఎఫెక్ట్, టికెట్ రేట్లు(ఏపీలో) తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు బాగున్న సినిమాలు దుమ్మురేపుతున్న నేపథ్యంలో ఇలాంటి టైమ్‌లో `అఖండ` నార్త్ లో రిలీజ్ అయితే మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు. పైగా హిందీ ఆడియెన్స్ మాస్, యాక్షన్ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`, `కేజీఎఫ్`, `విక్రమ్`, `పుష్ప`, `కాంతార` చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. ఆ కోవలోనే `అఖండ`కి ఘన విజయాన్ని అందించడంలో అతిశయోక్తి లేదంటోంది యూనిట్. మరి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ విషయం తెలిసి బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. పూర్ణ కీలక పాత్రలో, శ్రీకాంత్ నెగటివ్ పాత్రలో నటించారు. ద్వారకా మూవీస్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన నటన, యాక్షన్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఆ పూనకాలే సినిమాకి తిరుగులేని విజయాన్ని అందించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.