Akhanda:'అఖండ' ఫస్ట్ వీకెండ్,భాక్స్ బ్రద్దలైంది
ముఖ్యంగా కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది.
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు బ్రద్దలు కొడుతోంది. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో బాలయ్య ఇతర సినిమాలతో పోలిస్తే అఖండ ముందంజలో ఉంది. వీకెండ్‌లో కూడా అదే స్పీడ్‌తో దూసుకుపోయింది. ఎక్కడా డ్రాప్ అనేది లేదు. ముఖ్యంగా కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఎక్కువ మంది ప్రేక్షకుల్ని థియేటర్‌కు తీసుకువచ్చిన చిత్రంగా నిలిచింది ‘అఖండ’. తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ఇదే హవా కొనసాగిస్తోంది.
ఇంతకు ముందు బోయపాటి, బాలకృష్ణ కాంబోలో వచ్చిన లెజెండ్, సింహా ప్రేక్షకులను బాగా అలరించాయి. దాంతో బాలకృష్ణతో కలిస్తే బోయపాటి అద్భుతాలు సృష్టిస్తాడని ప్రేక్షకులు లెక్కేసుకుంటున్నారు. అందులోనూ ఈసారి బాలకృష్ణను అఘోరగా, కామన్ మ్యాన్ గా చూపించనున్నామని బోయపాటి చెప్పడం మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. దాంతో సినిమా రిలీజ్ కాగానే ప్రేక్షకులు హై ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ల ముందు క్యూ కట్టారు. వీరంతా సినిమా అదిరిపోయేలా ఉందని ఇనానమస్ గా అనటంతో మిగతా ప్రేక్షకులు కూడా ఉత్సుకతతో అఖండ మూవీని చూసేందుకు హాళ్లకు వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్ ఎంతొచ్చాయో చూద్దాం.
విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సినిమా రూ.63 కోట్లకిపైగా గ్రాస్ వసూళ్లని సొంతం చేసుకుంది. షేర్ 40 కోట్లు వచ్చింది. ఇది బాలయ్యకు సరికొత్త రికార్డ్. బాలయ్య కెరీర్ లోనే అతి పెద్ద రికార్డ్. ఆదివారం హాళ్లు దాదాపుగా హౌస్‌ఫుల్ బోర్డులతో రన్ అయినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. పలు ప్రాంతాల్లో బాలకృష్ణ గత సినిమాలు సాధించిన రికార్డుల్ని తుడిచేసింది.
ఇక ఓవర్ సీస్ విషయానికి వస్తే... కొవిడ్ సెకండ్ తర్వాత ఓవర్సీస్‌లో (విడుదలైన తొలిరోజు) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రమిదేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం.. ఈ సినిమా కెనడాలో (ప్రీమియర్‌తో కలిపి) సుమారు రూ. 13లక్షలు, యుకేలో సుమారు రూ. 32 లక్షలు, ఆస్ట్రేలియాలో సుమారు రూ. 52 లక్షలు రాబట్టిందని పేర్కొన్నారు. అమెరికాలో (మూడు రోజులు కలిపి) సుమారు రూ.5 కోట్లు కలెక్ట్ చేసిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలిపింది.