‘అఖండ’ లో ఆ పాత్ర చరిత్రతో ముడి?!
ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ చారిత్రక ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ మొత్తం క్లైమాక్స్ లో రాబోతున్నాయి.
‘అఖండ’ లో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయన్స్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. కరోనా ఉద్ధృతి వల్ల తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ కుదుట పడటం వల్ల మిగిలిన షూట్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజా షెడ్యూల్ చారిత్రక ప్రాంతాల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీన్స్ మొత్తం క్లైమాక్స్ లో రాబోతున్నాయి.
ఏపీలోని గండికోట, కడప, చిత్తూరులోని చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందని సమాచారం. ఇవన్నీ చూస్తూంటే చరిత్రతో ఈ సినిమా కథకు లింక్ ఉంటుందా అని సందేహ పడుతున్నారు. సినిమాలో వచ్చే బాలయ్య రెండో పాత్రకు బ్యాక్ గ్రౌండ్ హిస్టారికల్ క్యారక్టర్ నుంచి తీసుకున్నారంటున్నారు. అందుకే అక్కడ లొకేషన్స్ ఎంచుకున్నారని ఓ వార్త మొదలైంది.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూస్తారు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణతో చేస్తున్న ‘అఖండ’పై ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు దీటుగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. టీజర్‌కి ఇంతగా ఆదరణ దక్కడం సంతృప్తినిచ్చింది. కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించాలి’’అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాల్ని రెట్టింపు చేసింది టీజర్. మా సంస్థలో రూపొందుతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రమిది. పరిస్థితులు కుదుటపడ్డాక విడుదల చేస్తాం’’ అన్నారు.
ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఇంటర్నెట్ లో సంచలనాలు సృష్టిస్తోంది. శరవేగంగా 50 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పిన డైలాగులు, ఆయన గెటప్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. జగపతిబాబు, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్.