దర్శకదీరుడు రాజమౌళి నుంచి వచ్చిన శిష్యుల సంఖ్య చాలా తక్కువ. వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న టీమ్ నుంచి ఒక గ్యాంగ్ సరికొత్త సినిమాతో రెడీ అయ్యింది

దర్శకదీరుడు రాజమౌళి నుంచి వచ్చిన శిష్యుల సంఖ్య చాలా తక్కువ. వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో పెద్దగా నిలదొక్కుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న టీమ్ నుంచి ఒక గ్యాంగ్ సరికొత్త సినిమాతో రెడీ అయ్యింది. వెండితెరపై ఒక సరికొత్త ప్రయోగంతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

సముద్రఖని తప్పితే పూర్తిగా నూతన నటీనటులతో తెరకెక్కిన సినిమా ఆకాశవాణి. ఈ సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తుండగా రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి - ఈగ సినిమాలకు పనిచేసిన అశ్విన్ తన మొదటి సినిమాను సైన్స్ ఫిక్షన తరహాలో తెరకెక్కించాడు. అనుకున్నట్టుగానే 50 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేశారు. 

ఈ విషయాన్నీ కార్తికేయ తెలియజేశారు. ఇక సినిమాకు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రయోగాత్మక చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి జక్కన్న ఫ్యామిలీ నుంచి వస్తోన్న ఈ సెకండ్ జనరేషన్ టీమ్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.