భోజ్‌పురి యువ నటి ఆకాంక్ష దూబే మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఆకాంక్ష కడుపులో గుర్తుతెలియని లిక్విడ్ ఉందని పోస్టు మార్టమ్ నివేదిక ద్వారా వెల్లడైంది.
భోజ్‌పురి యువ నటి ఆకాంక్ష దూబే మృతి కేసు మరో మలుపు తిరిగింది. మార్చి 26న ఆకాంక్ష ఉత్తరప్రదేశ్‌లోని ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుని కనిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె పోస్టుమార్టమ్ రిపోర్టు బయటకువచ్చింది. ఆమె కడుపులో గుర్తుతెలియని లిక్విడ్ ఉందని పోస్టు మార్టమ్ నివేదిక ద్వారా వెల్లడైంది. ఆమె కడుపులో ఆహారం లేదా ద్రవం లేవని పోస్ట్‌మార్టం నివేదిక సూచించింది. ఆమె మద్యం తాగలేదని.. శరీరంలో ఎలాంటి మద్యం జాడలు కనుగొనబడలేదని పేర్కొంది.అయితే ఆమె కడుపులో 20 మిల్లీలీటర్ల తెలియని గోధుమరంగు ద్రవం కనిపించిందని.. అంతేకాకుండా కడుపు యొక్క శ్లేష్మ పొర కూడా ఉక్కిరిబిక్కిరి చేయబడిందని రిపోర్ట్ వెల్లడించింది. అలాగే ఆమె మణికట్టుపై గాయం గుర్తులు కూడా ఉన్నట్టుగా తేలింది.
ఆకాంక్ష దూబే శరీరం లోపల దొరికిన ద్రవం ఏమిటి?, ఆమె కడుపులోని శ్లేష్మ పొర ఉక్కిరిబిక్కిరి కావడానికి ఆ ద్రవమే కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. అయితే ఆకాంక్ష మణికట్టుపై గాయాలు ఉండటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక, ఆకాంక్ష తల్లి మధు దూబే తన కూతురి మరణానికి ఇద్దరు వ్యక్తులు కారణామని ఆరోపించారు. సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్‌ల తన కూతురు హత్యకు కారణమని అన్నారు. మార్చి 21న సంజయ్ సింగ్ ఆకాంక్ష దూబేని చంపేస్తానని బెదిరించాడని.. ఆ విషయాన్ని ఆమె స్వయంగా తనకు ఫోన్ ద్వారా తెలియజేసిందని చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఆకాంక్ష మృతిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆకాంక్ష మృతిచెందినప్పటీ నుంచి వారు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. అయితే ఈ క్రమంలోనే సమర్ సింగ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.
ఇక, ఆకాంక్ష దూబే మేరీ జంగ్ మేరా ఫైస్లాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె ముజ్సే షాదీ కరోగి (భోజ్‌పురి), వీరన్ కే వీర్, ఫైటర్ కింగ్‌లో కూడా కనిపించారు. చిన్న వయసులోనే తన నటనా నైపుణ్యంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకాంక్ష దూబేకు విశేష ఆదరణ ఉంది. చాలా మంది ఆమె వీడియోలను ఫాలోయింగ్ ఉండేది. అయితే తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఆకాంక్ష దూబే వారణాసిలో ఉన్నట్లు సమాచారం. చిత్రీకరణ తర్వాత నటి అక్కడి సారనాథ్ హోటల్‌కి వెళ్లింది. ఆ సమయంలోనే ఆకాంక్ష హోటల్ గదిలో శవమై కనిపించింది.
