Asianet News TeluguAsianet News Telugu

మహేష్ హిట్ సినిమాని గుర్తు చేస్తున్న ‘తెగింపు’సెకండాఫ్

ఇదొక విభిన్న తరహా క్రైమ్‌ కథ. బ్యాంకు దోపిడీ ఇతివృత్తంగా రూపొందింది. సముద్రఖని, వీర, భగవతి పెరుమాళ్, అజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Ajith #Tegimpu movie reminds Mahesh movie, especially in the second half
Author
First Published Jan 11, 2023, 5:32 AM IST

ఎప్పటికప్పుడు డబ్బింగ్ సినిమాలతో అలరించే స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. తమిళం లో బిగ్గెస్ట్ మాస్ హీరో అజిత్ సినిమా వస్తుంది అంటే అక్కడ ఎక్సపెక్టేషన్స్ మామూలుగా ఉండవు. ఓపినింగ్స్ రచ్చగా ఉంటుంది.అదే కోవలో ఈ రోజు రిలీజ్ అయిన  లేటెస్ట్ సినిమా ”తునివు”కూడా ఫ్యాన్స్ షోలతో దద్దరిల్లిపోతోంది.ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవటం మరో ప్లస్. అజిత్ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో రిలీజ్ అవుతోంది.అయితే విజయ్ సినిమా వారసుడు రెండు రోజుల పాటు వాయిదా పడి జనవరి 14న రిలీజ్ కాబోతుంది.దీంతో అజిత్ సినిమా తెలుగులో భారీ స్క్రీన్స్ లో రిలీజ్ అయినట్లు తెలుస్తుంది. తెగింపు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అజిత్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ దక్కినట్టు టాక్.దీంతో ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పాలి.

ఇప్పటికే తమిళనాట, అమెరికాలోనూ ప్రీమియర్ షోలు ఈ సినిమాకు పడ్డాయి. ఈ సినిమా మహేష్ బాబు చిత్రం సర్కారు వారి పాటను గుర్తు చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ నేరేషన్ లో బాగా ఆ సినిమా ఛాయిలు కనపడతాయని చూసిన వారు పోస్ట్ లు పెడుతున్నారు. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్ ల ప్రకారం ఈ సినిమా అజిత్ అభిమానులకు నచ్చే అంశాలతో ఉందని ..స్ట్రిక్ట్ గా అభిమానులకే అంటున్నారు. అజిత్ తన style & swag తో దుమ్ము రేపాడంటున్నారు. ఫస్టాఫ్ పెద్దగా ఎక్సైట్మెంట్ తో లేదని, క్లైమాక్స్ కూడా సోసో గా ఉందని అంటున్నారు. దర్శకుడు హెచ్ వినోద్..ఫ్యాన్ షోలా సినిమాని మార్చే ప్రయత్నంలో కథ,స్క్రీన్ ప్లే వదిలేసాడని ఫస్ట్ రిపోర్ట్
 
 ఈ సినిమా తెలుగు ట్రైలర్ అభిమానుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అజిత్ చేసిన యాక్షన్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఉవ్విళ్లూరుతున్నారు.   పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. 

ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అసలు థియేటర్స్ దొరుకుతాయా లేదా....ఓపినింగ్స్ వస్తాయా..ప్రమోషన్ లేదే అని అందరూ కామెంట్స్ చేసారు. కానీ సంక్రాంతి రేసులో మొదటగా ఈ సినిమానే ఇక్కడ రిలీజ్ అవటం కలిసివస్తోంది. ఓ రకంగా ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా ఏ సినిమా లు మరో రెండు రోజులు దాకా ఉండవు. కాబట్టి టాక్ బాగుంటే కుమ్మేసుకోవచ్చు. అలాగే కావాల్సినన్ని థియేటర్స్ రిలీజ్ రోజు దొరుకుతున్నాయి. దాంతో ఈ మద్యకాలంలో  తెలుగులో ఏ ఇతర డబ్బింగ్ సినిమా రిలీజ్ కానీ రీతిలో భారీగా అవుతోంది. అదిరిపోయే ఓపినింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.
  
వాస్తవానికి తెగింపు  చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఈ సినిమాకు వస్తున్న  బిజినెస్ చూసి, ఈ సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే అజిత్ తునివు చిత్రాన్న జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో పొంగల్ రిలీజ్ లలో అజిత్ ముందుగా దిగాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios