త‌ల అజిత్ సినిమాలు అంటే ఫ్యాన్స్ కు ఎంత పిచ్చో తెలిసిందే.  ఆయన కొత్త సినిమా  వస్తోందంటే  క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. రిలీజ్ రోజు వాళ్లు చేసే రచ్చ గురించి అయితే చెప్పక్కర్లేదు. పాలాభిషేకాలు, ధియోటర్ లో హారతులు వంటివి కామన్ గా జరిగిపోతూంటాయి. రీసెంట్ గా మొన్న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన అజిత్ చివ‌రి చిత్రం విశ్వాసం కూడా అదే శైలిలో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. అంతేకాదు ఈ చిత్రాన్ని  మ‌రో మైల్ స్టోన్ అందుకునేలా చేసారు. 

జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం సన్ టీవీలో ప్రీమియర్ షో వేస్తే రికార్డ్ లు బ్రద్దలు అయ్యిపోయాయి. మే 1న  అజిత్ పుట్టిన రోజు సందర్బంగా టెలీకాస్ట్ చేసిన ఈ చిత్రం 1,81,43,000  ఇంప్రెషన్స్ తో  ఇప్పటివరకూ ఏ సౌతిండయన్ సినిమా క్రియోట్ చేయని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా విజయ్ ఆంటోని బిచ్చగాడు, ప్రభాస్ బాహుబలి చిత్రాలే టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసం సినిమా దాన్ని బ్రద్దలు కొట్టింది. 

ఈ సినిమా తెలుగులో పెద్దగా వర్కవుట్ కాకపోయినా త‌మిళ‌నాడులోని ప‌లు థియేట‌ర్‌లో ప్ర‌స్తుతం ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 200 కోట్లు రాబ‌ట్టిన ఈ చిత్రాన్ని తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లోను విడుద‌ల చేశారు . అక్క‌డ కూడా ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. విశ్వాసం చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు. 

ప్ర‌స్తుతం అజిత్ హిందీలో విజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వంలో నెర్కొండ పార్వాయి అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మిస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది.