కోలీవుడ్ స్టార్ హీరోస్ లో రజినీకాంత్ తరువాత ఎవరు నంబర్ 2 అని చెప్పడం అంత ఈజీ కాదు. ఎప్పటికప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో బాక్స్ అరికార్డులు మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇలయథలపతి విజయ్ - థలా అజిత్ సినిమాల రికార్డులు క్లాష్ అవుతుంటాయి. ఇక అజిత్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ జోష్ మాములుగా ఉండదు. 

100కోట్ల మార్కెట్ ఉన్న ఈ స్టార్ హీరో ఇటీవల డిఫరెంట్ గా నెర్కొండ పరవాయ్ సినిమాతో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ పింక్ రీమేక్ గా వచ్చిన ఆ సినిమాను బోణి కపూర్ నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలు అందాయి. ఇక నెక్స్ట్ బోణి కపూర్ ప్రొడక్షన్ లోనే అజిత్ మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కార్ రేజింగ్ కి సంబందించిన కథాంశంతో అజిత్ నెక్స్ట్ సినిమా రాబోతోంది. 

సినిమాలో యువకుడిగా కనిపించేందుకు థలా తన లుక్ ని మొత్తం మార్చేశాడు. చాలా వరకు తెల్లగా మెరిసిన గెడ్డంతో స్టైలిష్ గా కనిపించే అజిత్ ఇప్పుడు యువ రేజర్ గా కనిపించబోతున్నాడు. అందుకు సంబందించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యాలని బోణి కపూర్ ప్లాన్ చేస్తున్నారు.