‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షూటింగ్‌లో అజిత్ అందరికీ వండి వడ్డించిన ఘటనను నటుడు రాహుల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. అజిత్ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. 

తమిళ సినీ పరిశ్రమలో 'తల'గా పేరుగాంచిన అజిత్ కుమార్ తన  సింపుల్ లైఫ్ స్టైల్ , వినయం, తోటి నటుల పట్ల శ్రద్ధతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన గొప్పతనాన్ని చాటే మరో ఘటనను బాలీవుడ్, దక్షిణాది నటుడు రాహుల్ దేవ్ ఇటీవల వెల్లడించారు. అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన అజిత్ వ్యక్తిత్వానికి మరో కోణాన్ని ఆవిష్కరించింది.

ఇంటర్వ్యూలో రాహుల్ దేవ్, అజిత్‌తో తన అనుబంధం, ఆయన మంచితనం గురించి చెప్పుకొచ్చారు. “నేను చాలా ఏళ్లుగా అజిత్‌ని  చూస్తున్నాను. . 'వేదాళం', 'విశ్వాసం' సినిమాల్లో కలిసి నటించాం. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి కూడా. మన సినీ పరిశ్రమలో ఉన్న అతి కొద్ది మంది మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు” అని రాహుల్ అన్నారు.

'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూటింగ్ మొదటి రోజు జరిగిన ఓ సంఘటనను రాహుల్ గుర్తు చేసుకున్నారు. “షూటింగ్ మొదటి రోజు అజిత్ సెట్‌లో అందరికీ స్వయంగా వండి వడ్డించారు. సాధారణంగా ఇంత పెద్ద స్టార్లు కారవాన్ దిగడమే అరుదు. కానీ అజిత్ అందరితో కలిసిపోయి, వండి, ప్రేమగా వడ్డించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన వండినవి చాలా బాగున్నాయి” అని వివరించారు.

ఇది కేవలం వంట చేయడం కాదు, అజిత్‌కి ఉన్న మంచి మనసు, తోటి వారి పట్ల శ్రద్ధను చూపిస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. “ఇంత పెద్ద నటుడు ఇలా చేస్తే సెట్‌లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అందరూ కుటుంబంలా అనిపిస్తుంది. ఆయన సింపుల్ సిటీ,  వినయమే ఆయన్ని అందరికీ ఇష్టుడిని చేశాయి” అని రాహుల్ అన్నారు.

బైక్ రైడింగ్, ఫోటోగ్రఫీ, ఏరో మోడలింగ్ వంటి అభిరుచులతో అజిత్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక సేవ, వినయం ఆయన్ని అభిమానులకు 'నిజమైన హీరో'గా నిలిపాయి.

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కెరీర్‌లో 63వ సినిమా. ఈ సినిమాలో అజిత్ విభిన్నమైన పాత్రలో కనిపించారు రాహుల్ దేవ్ శేర్ చేసిన  ఈ అనుభవం అజిత్ లో  మంచితనానికి మరో ఉదాహరణ. స్టార్‌డమ్ అహంకారం లేకుండా అందరితో సమానంగా మెలిగే ఆయన గుణం అభినందనీయం.