బాలీవుడ్ లో సౌత్ రీమేక్ ల హవా పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు నుంచి కొన్ని కథలు అక్కడ తెరకెక్కుతున్నాయి.. మరికొన్ని లైన్ లో ఉన్నాయి. మరికొన్ని ప్రపోజల్స్ లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు బాలీవుడ్ చేరుతున్నాయి. అందులో కార్తి ఖైదీ సినిమా కూడా ఉంది.
బాలీవుడ్ లో సౌత్ రీమేక్ ల హవా పెరిగిపోతోంది. ఇప్పటికే తెలుగు నుంచి కొన్ని కథలు అక్కడ తెరకెక్కుతున్నాయి.. మరికొన్ని లైన్ లో ఉన్నాయి. మరికొన్ని ప్రపోజల్స్ లో ఉన్నాయి. ఇక కోలీవుడ్ నుంచి కూడా కొన్ని సినిమాలు బాలీవుడ్ చేరుతున్నాయి. అందులో కార్తి ఖైదీ సినిమా కూడా ఉంది.
మొన్నటి వరకూ సల్మాన్ ఖాన్ ఎక్కువగా సౌత్ సినిమాలు రీమేక్ చేసేవాడు. సౌత్ లో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ చేసి సల్మాన్ ఖాన్ హిట్ కొట్టారు. కాని ఇప్పుడు చాలా మంది స్టార్స్ సౌత్ సినిమాలపై మోజు పడుతున్నారు. అందులో షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్స్ చాలా మంది ఉన్నారు. సల్మాన్ తరువాత సౌత్ కథలతో సి నిమాలు చేస్తున్న స్టార్స్ లో అజయ్ దేవగణ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
అజయ్ దేవగణ్(Ajay Devgan)తెలుగు,తమిళ సినిమాలపైన మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో అల్లరి నరేష్ నాందీ సినిమా కథను తీసుకుని అందులో నటించడమే కాకుండా.. స్వయంగా నిర్మిస్తున్నారు అజయ్ దేవగణ్. తెలుగుతో పాటు తమిళ కథలపై కూడా మనసు పారేసుకుంటున్నారు బాలీవుడ్ హీరో. అజయ్ దేవగణ్(Ajay Devgan) .. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం3 మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు సూర్య తమ్ముడు కార్తి నటించిన ఖైదీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారు అజయ్ దేవగణ్.
కార్తి హీరోగా వచ్చిన ఖైదీ సినిమా తమిళ్ లో సూపర్ కలెక్షన్స్ ను సాధించింది. కార్తి కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇటు టాలీవుడ్ లో కూడా సక్సెస్ అయిన ఖైదీ సినిమాతో లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా మంచి అవకాశాలు కూడా సాధించారు. బలమైన స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తీర్చి దిద్దిన ఖైదీ సినిమాలో కమర్షియల్ హంగులు కనిపించవు. పాటలు..డాన్సులు లాంటివి లేకుండా.. సినిమాను సీరియస్ ట్రాక్ లో నడిపించారు.
అయితే ఈసినిమాకు కొన్ని కమర్షయల్ హంగులు జోడించి.. పాటలు, డాన్స్ లు లాంటి వాటితో ఎంటర్టైన్మెంట్ హంగులు అద్ది.. బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చేలా ఖైదీ సినిమాను రీమేక్ చేయబోతున్నారు. అజయ్ దేవగణ్ ఈసినిమాలో కార్తి చేసిన మెయిన్ లీడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు.
Also Read : డేంజరస్ విలన్ తో చేతులు కలిపిన ఘాజి డైరెక్టర్.. స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
