మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చిరంజీవితో సినిమా చేసేందుకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. సైరా చిత్రం ఆలస్యం కావడంతో ఇన్నిరోజులు కొరటాలకు ఎదురుచూపులు తప్పలేదు. 

సైరా చివరి దశకు చేరుకోవడంతో చిరు, కొరటాల చిత్ర కార్యక్రమాలు మొదలైపోయాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అనుష్క, నయనతార, తమన్నా ఇలా స్టార్ హీరోయిన్లందరి పేర్లు వినిపించాయి. కానీ కొరటాల ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఆడియన్స్ ప్రెష్ కాంబినేషన్ అని ఫీల్ అయ్యేలా బాలీవుడ్ స్టార్ ని దించాలని భావిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొరటాల రాంచరణ్ తో మాట్లాడారట. 

ఈ చిత్రం కోసం ఐశ్వర్యారాయ్ ని ఒప్పించేలా ప్రయత్నాలు చేయాలని రాంచరణ్ ని కోరినట్లు తెలుస్తోంది. ఐశ్వర్యారాయ్ తమిళ చిత్రాలు ద్వారా సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచయమే. మరి మెగాస్టార్ సినిమాకు ఓకే చెబుతుందో లేదో చూడాలి.