ఆరోగ్యమే అసలైన హెల్త్ అంటున్నారు ఐశ్వర్య రజినీకాంత్. హెల్త్ కోసం వ్యయామం అవసరమంటున్న ఈ స్టార్ కిడ్ డెడ్లీ వర్కవుట్ వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  

జీవితంలో లక్ష్యాలు సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మరి ఆరోగ్యం వ్యాయామం తోనే సాధ్యం. ఈ సత్యాన్ని ప్రాక్టికల్ గా ఉదహరిస్తున్నారు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth). డైలీ ఆమె ఎన్ని కఠిన వ్యాయామాలు చేస్తారో వీడియో రూపంలో పంచుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో వర్కవుట్ వీడియో షేర్ చేయడంతో పాటు ఇన్స్పిరేషనల్ కామెంట్స్ కూడా చేశారు. వ్యాయామంతో పాటు మంచి ఆహారం తీసుకుని స్ట్రాంగ్, స్లిమ్ గా ఉండాలని సూచించారు. 

ఇద్దరు పిల్లల తల్లైన ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుత వయసు 40 ఏళ్ళు. కానీ ఆమె చాలా యవ్వనంగా కనిపిస్తారు. దానికి కారణం ఆరోగ్యం విషయంలో ఆమె చాలా క్రమశిక్షణగా ఉండడమే. కాగా డైరెక్టర్, సింగర్ అయిన ఐశ్వర్య ఈ మధ్య కొత్త ఓ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించారు. ఈ ఆల్బమ్ ని సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ మహేష్, మోహన్ లాల్, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ప్రోమోట్ చేశారు. 

View post on Instagram

మరోవైపు ఐశ్వర్య భర్త ధనుష్ (Dhanush)తో విడిపోయిన విషయం తెలిసిందే. కొద్దినెలల క్రితం అధికారికంగా ధనుష్-ఐశ్యర్య ప్రకటన చేశారు. 18ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. వీరికి ఇద్దరు టీనేజ్ బాయ్స్ ఉన్నారు. అధికారికంగా విడాకులు ప్రకటించినా ధనుష్-ఐశ్వర్య స్నేహం కొనసాగిస్తున్నారు. ఐశ్వర్య ఆల్బమ్ సక్సెస్ కావాలని ధనుష్ విష్ చేయగా.. థాంక్యూ ఫ్రెండ్ అంటూ ఏ రిప్లై ఇచ్చారు. 

వీరిద్దరినీ కలపాలని కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించినట్లు వార్తలు వినిపించాయి. విడాకులకు గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ధనుష్ అఫైర్స్ కారణంగా ఐశ్వర్య ఈ నిర్ణయం తీసుకున్నారంటూ పుకార్లు వినిపించాయి. అసలు నిజాలు ఏమిటనేది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే తెలుసని సమాచారం.