#Anirudh నా సినిమా ఫెయిల్యూర్ కు కారణం అనిరిధ్ మ్యూజిక్కే
అనిరుధ్ రవిచందర్ సంగీతం వల్లే తన సినిమా పోయిందని ఐశ్వర్యా రజనీకాంత్ చెప్పి షాక్ ఇచ్చారు. తాజాగా ఆమె లాల్ సలామ్ చిత్రం డైర
తెలుగు,తమిళ భాషల్లో విపరీతమైన డిమాండ్ లో ఉన్న సంగీత దర్శకుడు ఎవరూ అంటే అనిరుద్ రవిచందర్ అని చెప్పాలి. అనిరుధ్ రవిచందర్ సినిమా పాటలు ఒకదాని తర్వాత ఒకటి వైరల్ అవటమే అందుకు కారణం. తమిళం, తెలుగు చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్ షారుక్ ఖాన్ ‘జవాన్’ ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ దశలో తనకు రోజుకో సినిమా ఆఫర్లు వస్తున్నాయని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.అంతే కాదు ఆయన లైవ్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇదిలా ఉంటే అనిరుధ్ రవిచందర్ సంగీతం వల్లే తన సినిమా పోయిందని ఐశ్వర్యా రజనీకాంత్ చెప్పి షాక్ ఇచ్చారు. తాజాగా ఆమె లాల్ సలామ్ చిత్రం డైరక్ట్ చేసారు. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన తొలి చిత్రం ‘3’ ఫెయిల్యూర్ గురించి ఇలా అన్నారు.
ఐశ్వర్యా రజనీకాంత్ మాట్లాడుతూ... ‘3’ సినిమాలోని వై దిస్ కొలావరి సాంగ్ పెద్ద హిట్టైంది. సినిమా రిలీజ్ కాకముందే ఆ పాట జనాల్లోకి వెళ్లిపోయింది. ఎంతలా ఆ పాట సక్సెస్ అయ్యందంటే సినిమాలో కంటంట్ ని ఓవర్ షాడో చేసేటంత. దాంతో ఈ సినిమా సబ్జెక్ట్ చేలా సీరియస్ గా ఉన్నా పాటను విన్న వారంతా డిఫరెంట్ ఎక్సపెక్టేషన్స్ తో థియేటర్స్ కు వచ్చారు. దాంతో సినిమా బాగోలేదన్నారు.
ఇక “ఈ సినిమా రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే టీవిల్లో టెలీకాస్ట్ అయ్యినప్పుడు చాలా మందికి నచ్చింది. ఎందుకంటే అప్పటికి ఆ పాట మ్యాజిక్ తగ్గింది. అలా సినిమాకు పాటే అడ్డం గా నిలిచింది. అయితే నేను ఒకందుకు ఆనందపడతాను.. నా సినిమాలో పాట అతని కెరీర్ ని నెంబర్ స్టేజీకు తీసుకెల్లిందని.. ,” అని చెప్పుకొచ్చారామె.
ఇదిలా ఉంటే అనిరిథ్ తో పని చేయించుకోవడం తెలుగు దర్శకులకు కత్తి మీద సాములా మారిపోతోంది. ఏప్రిల్ 5 లాంటి మంచి డేట్ ని దేవర వదులుకోవడం పట్ల ఫ్యాన్స్ ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. నెలల క్రితమే లాక్ చేసుకున్న తేదీని ఎందుకు రీచ్ కాలేకపోయారని నిలదీస్తున్నారు. ఊహించని విధంగా సైఫ్ అలీ ఖాన్ ప్రమాదానికి గురి కావడం ఒక కారణమైనా మరీ వారాల తరబడి మంచం మీద ఉండేంత తీవ్రమైంది కాకపోవడంతో అతి త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతాడనే టాక్ ఉంది. సో ఇబ్బంది లేదు.
అనిరుధ్ రవిచందర్ ‘హుకుమ్’ పేరుతో ప్రపంచ సంగీత యాత్రలో బిజీగా ఉన్నారు. అనిరుధ్ విదేశాల్లో భారీ లైవ్ షోలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని తెలిపాడు. విశేషమేమిటంటే మలయాళంలో ఆ సినిమాను అనిరుధ్ రవిచందర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అనిరుధ్ తెలిపారు. అలాగే, తన అభిమాన నటుడితో పాన్ ఇండియా సినిమా కోసం పనిచేస్తున్నట్లు కూడా పేర్కొన్నాడు. అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ ‘దేవర’తోపాటు కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’, ‘విడ మూర్చి’, రజనీకాంత్ ‘వెట్టయన్’, రజనీకాంత్ 171, విఘ్నేష్ శివన్ ‘ఎల్‌ఐసి’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు