రాజమౌళి సినిమాలోనే కాదు..పవన్ తోనూ చేస్తోంది

`అయ్యప్పనమ్ కోషియం` రీమేక్ కి `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర  దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో  చేయనున్నారు. ఇక రెండవ హీరో పాత్రకు నితిన్ ని అనుకుంటున్నారని మీడియా వర్గాల సమాచారం.  ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ కు వెళ్తుంది.
 

Aishwarya Rajesh To Become Pawan Kalyans Wife? jsp

కాక్కాముట్టై చిత్రంతో సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్‌. కనా చిత్రంలో హీరోయిన్ గా నటించి తన ఇమేజ్‌ను పెంచుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా సాగిస్తుంది ఐశ్వర్య రాజేష్. ఇప్పటికే తెలుగులో ఈ అమ్మడు కౌసల్య కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

 ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయ్యప్పన్ కొషియం తెలుగు రీమేక్ లో ఐశ్వర్య రాజేష్ నటించబోతుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆపాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ పాత్రకు మొదట సాయి పల్లవి పేరు వినిపించినప్పటికీ తాజాగా ఐశ్వర్య పేరు తెరమీదకు వచ్చింది. 

 అయితే ఈ ఆఫర్ ఐశ్వర్య రాజేష్ కు వస్తే మాత్రం తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటన్నారు. ఇమేజ్‌ కంటే నచ్చిన పాత్రలు పోషించడమే ధ్యేయంగా పెట్టుకున్నానన్నాను అని ఆమె చెప్తున్నారు. చిన్న వయస్సులోనే కాక్కాముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించినట్లు గుర్తుచేశారు. ఆ చిత్రంతో తన జీవితం మలుపు తిరిగిందని, అలాంటి పాత్రలే తన ఇమేజ్‌ను పెంచుతున్నాయన్నారు. ఈ కారణంగానే అనేక విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు చెప్పారు. ఆమె ప్రస్తుతం నాని యొక్క టక్ జగదీష్ లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. దేవ కట్టాతో సాయి ధరమ్‌ తేజ్ చేస్తున్న కొత్త సినిమా కోసం కూడా ఆమె సంతకం చేసింది.

ఇక అయ్యప్పనమ్ కోషియం రీమేక్  మేకర్స్ ఈ సినిమాలో సెకండ్ లీడ్‌ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో  చేయనున్నారు. ఇక రెండవ హీరో పాత్రకు నితిన్ ని అనుకుంటున్నారని మీడియా వర్గాల సమాచారం.  ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ కు వెళ్తుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios