Asianet News TeluguAsianet News Telugu

అందుకే గ్లామర్ పాత్రలు చేయను..కారణం క్లియర్ గా చెప్పిన ఐశ్వర్య రాజేష్

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

Aishwarya Rajesh shocking comments on glamour show in movies dtr
Author
First Published Jul 21, 2024, 9:14 PM IST | Last Updated Jul 21, 2024, 9:14 PM IST

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.  

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

ఐశ్వర్య రాజేష్ వైవిధ్యమైన పాత్రలు ఎన్ని చేసినప్పటికీ గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లడం లేదు. అందుకే ఐశ్వర్య రాజేష్ కి కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. 

దీనిపై తాజాగా ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ క్లారిటీ ఇచ్చింది. తాను గ్లామర్ పాత్రల్లో నటించానని క్లియర్ గా చెప్పేసింది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కి గ్లామర్ పాత్రలు సరిపడవు. నేను వాటికి దూరం అని పేర్కొంది. అయితే ఐశ్వర్య రాజేష్ సినిమాల్లో గ్లామర్ గా కనిపించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రమే రెచ్చిపోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ కూడా ఇటీవల తరచుగా గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios