తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. మొదటి నుండి కూడా సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. 

క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విక్రమ్ తో కలిసి ఆమె 'సామి 2' సినిమాలో నటించింది. హరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. 

అయితే అందులో నటించడం తనకు ఇష్టం లేదని అన్నారు ఐశ్వర్య. అలాంటి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని, వ్యక్తిగతంగా కోరడం వలన తప్పక చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ పాత్రలో నటించడానికి ఎవరూ అంగీకరించలేదని చెప్పారు.

కేవలమ రెండు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదని.. అలాంటి చిత్రాల్లో నేను చేయను అంటూ చెప్పుకొచ్చింది.