ఐశ్వర్య రాయ్ మాత్రం చాలా లేట్‌గా రియాక్ట్ అయ్యారు. ఆదివారం లతా మంగేష్కర్ కన్నుమూయగా, ఐశ్వర్య మంగళవారం స్పందించారు.
మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai).. ఇప్పుడు నెట్టింట ట్రోల్ అవుతుంది. ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత లేట్‌గా రియాక్ట్ అవుతారా? ఇప్పటికే నిద్ర లేచారా ? అంటూ ఏకి పడేస్తున్నారు. మరి ఇంతకి ఐశ్వర్య రాయ్ చేసిన తప్పేంటనేది చూస్తే.. మూడు రోజుల క్రితం లెజెండరీ సింగర్, స్వరకోకిల లతా మంగేష్కర్(Lata Mangeshkar)కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజులపాటు ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
ఆమె మరణంపై యావత్ ఇండియా స్పందించింది. సినీ అభిమానులు మాత్రమే కాదు, సినీ రాజకీయ, కార్పొరేట్‌ప్రముఖులు సైతం స్పందించారు. ఆమె మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపారు. లెజెండరీ గాయని మృతి సినీ సంగీతానికి తీరని లోటని విచారం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో వేల పాటు పాడిన లతాకి బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. మరికొందరు ఏకంగా ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్లు అర్పించారు. హిందీ ప్రముఖులే కాదు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, నార్త్ ఇలా అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఆమెకి సంతాపం తెలిపారు.
కానీAishwarya Rai మాత్రం చాలా లేట్‌గా రియాక్ట్ అయ్యారు. ఆదివారం లతా మంగేష్కర్ కన్నుమూయగా, ఐశ్వర్య మంగళవారం స్పందించారు. లతా మంగేష్కర్ ఫోటోని పంచుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ ఆమె ఫోటోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. లతాజీ ఆదివారం నాడు మరణిస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడే నిద్ర లేచారా?, ఇంత లేట్‌గా రియాక్ట్ అవుతారా?, ఈ వార్త మీకు ఇప్పుడు తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు. అనేక మంది నెటిజన్లు ఐశ్వర్యని ట్రోల్స్ చేస్తున్నాయి. కానీ ఈ మాజీ విశ్వసుందరి అభిమానులు మాత్రం ఆమెకి సపోర్ట్‌గా కామెంట్లు పెడుతుండటం విశేషం. ఐశ్వర్య ఫోన్ వాడని, దాని వల్లే ఆలస్యంగా సోషల్ మీడియాలో పంచుకున్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఐశ్వర్య రాయ్.. ఐదేళ్ల తర్వాత 2015లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రం `జజ్బా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత `సరబ్‌జిత్` చిత్రంతో అలరించింది. `ఏ దిల్ హై ముష్కిల్`, `ఫన్నే ఖాన్` చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఆమె మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్` చిత్ర సిరీస్‌లో నటిస్తుంది. ఇవి విడుదలకు సిద్ధమవుతుంది. ఇది తప్ప మరో సినిమా చేయడం లేదు ఐశ్వర్య. మ్యారేజ్ తర్వాత అంతకు ముందు స్థాయిలో ఆకట్టుకోలేకపోతుందనే కామెంట్ కూడా వినిపిస్తుంది.
