మరో వారం రోజుల్లో రజినీకాంత్ నటించిన '2.0' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది.

రోబో సినిమాలో హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ వంటి తార హీరోయిన్ గా నటించింది. కానీ 2.0లో హీరోయిన్ గా నటిస్తోన్న అమీజాక్సన్ కి పెద్దగా ప్రాముఖ్యత లేదనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందనే రూమర్ హల్చల్ చేస్తోంది.

'రోబో' సినిమాకి కొనసాగింపుగా వస్తోన్న సినిమా కావడంతో దానికి సంబంధించి సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయని సమాచారం. వాటిల్లో ఐశ్వర్యరాయ్ కనిపించనుందని అంటున్నారు. కానీ ఎక్కువసేపు తెరపై ఐశ్వర్య పాత్ర కనిపించదట. ఇదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా ప్లాన్ చేస్తున్నారు.

శంకర్, రజినీకాంత్ ల మీద ఉన్న అభిమానంతో ఐశ్వర్య ఈ సినిమాలో నటించిందని అంటున్నారు. నిజంగానే సినిమాలో ఐశ్వర్య ఉంటే ఆ సంగతి ప్రమోషన్స్ కి మరింత ప్లస్ అవుతుంది కదా.. కానీ యూనిట్ మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో కొద్దిరోజుల్లో తెలియనుంది!