వయసు నాలుగు పదులు దాటినా ఆమె ఎప్పుడైనా ప్రపంచ సుందరి అనే అంటారు. అంతగా ఐశ్వర్య రాయ్ గుర్తింపు తెచ్చుకుంది. అందంతోనే కాకుండా డ్యాన్స్, నటనలో కూడా ఆమె ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపోతే మ్యారేజ్ లైఫ్ అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న అమ్మడు సినీ ఫీల్డ్ ను మాత్రం దూరం చేసుకోవడం లేదు. 

సినిమాలకు సంబందించిన ఈవెంట్స్ అవార్డ్స్ ఫంక్షన్స్ జరిగితే అందంగా వాలిపోతోంది. ఇక వాలెంటైన్స్ డే సందర్బంగా ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా తన అందమైన చిన్న కుటుంబానికి సంబంధించిన ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది. అభిషేక్ బచ్చన్ తో పాటు కూతురు ఆరాధ్య కూడా అందంగా ఉన్నారని ఐశ్వర్య బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

రెండేళ్ల డేటింగ్ అనంతరం 2007లో వివాహం చేసుకున్న ఈ బెస్ట్ కపుల్స్ 2011 నవంబర్ 16న ఆరాధ్యకు జన్మనిచ్చారు. ఐశ్వర్య చివరగా ఫన్నే ఖాన్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా హిట్టవ్వలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Feb 13, 2019 at 5:56pm PST

Image Courtesy: Instagram