అందాల భామ ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్‌లు ఈ నెల 27 సోమవారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ బారిన పడటంతో బచ్చన కుటుంబం కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్యర్య, ఆరాధ్యలు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఐశ్వర్య తమ ఆరోగ్యం గురించి ప్రార్థన చేసిన వారందరికీ సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.

తన కూతురితో కలిసి చేతులను నమస్కారం చేస్తున్నట్టుగా, హార్ట్‌ సింబల్‌ లా చూపిస్తూ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. `మీ అందరి ప్రేమ, విషెస్‌, ప్రార్ధనలకు కృతజ్ఞతలు. పా, ఏబీ, డార్లింగ్ ఏంజెల్ ఆరాధ్య పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మీ అందరి మీద ఆ దేవుడి కరుణ ఎప్పటికీ ఉంటుంది` అంటూ కామెంట్ చేసింది ఐశ్వర్య రాయ్‌.

ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌లు నానావతి హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు ఆరోగ్య పరస్థితి బాగానే ఉందని త్వరలోనే పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవుతారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. జూలై 11న అమితాబ్‌ అభిషేక్‌లకు పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా ఆ తరువాత రోజు ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో అమితాబ్‌ ఇళ్లు జల్సాను కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇటీవలే వారి ఇంటికి ఉన్న కంటైన్మెంట్‌ స్టిక్కర్‌ను తీసేశారు మున్సిపల్‌ అధికారులు.