నాన్న మీరు సినిమాలు చేయొద్దు: స్టార్ హీరో కూతురు!

aishwarya dhanush suggestion to her father rajinikanth
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయన వయసు పెరిగే కొద్దీ క్రేజ్ మరింత పెరిగిపోతుంది. రీసెంట్ గా 'కాలా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజినీ. తెలుగులో ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం హిట్ టాక్ లభించింది. అయితే ఇప్పుడు అతడిని సినిమాలు చేయడం మానేయమని కోరిందట ఆయన కూతురు ఐశ్వర్య.

దానికి కారణం రజినీకాంత్ సినిమాలు మానేసి కుటుంబంతో సమయం కేటాయించాలని ఆమె భావిస్తోంది. అయితే సినిమాలు పూర్తిగా మానకుండా దశల వారీగా మానేయాలని ఆమె కోరుకుంటోంది. సినిమాల మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడంతో కుటుంబంతో ఎక్కువగా గడపలేకపోతున్నారని ఆమె చెబుతోంది. ఇదంతా బాగానే ఉంది కానీ రజినీకాంత్ సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అవ్వాలనుకుంటున్న ఇలాంటి సమయంలో ఆమె కుటుంబంతో గడపమని కోరుతోంది. మరి రజినీకాంత్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి!

 

loader