Sarath Babu : క్రిటికల్ గానే క్లినికల్ స్టేటస్.. శరత్ బాబు ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన ఏఐజీ డాక్టర్స్

హైదరాబాద్ లోని ప్రముఖ ఏఐజీ ఆస్ప్రతిలో నటుడు శరత్ బాబుకు చికిత్స అందుతోంది.  తాజాగా ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశరు. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం.. 
 

AIG Hospitals Update on Actor Sarath Babu Health NSK

సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu) అనారోగ్యం రీత్యా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గతనెలలో చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చేరిన ఆయనను  మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడి  నుంచి ఏప్రిల్ 20న హైదరాబాద్ లోని గచ్చిబౌలలో గల AIG ఆస్ప్రతికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది.

అయితే సోషల్ మీడియాలో శరత్ బాబు హెల్త్ కండీషన్ చాలా సీరియస్ గా ఉందని, ఆయన మల్టీ  ఆర్గాన్ ఫెల్యూర్ ను ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కుటుంబ సభ్యులు మాత్రం చికిత్స జరుగుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో శరత్ బాబు హెల్త్ పై సరైన స్పష్టత లేకుండా పోయింది. దీంతో నెట్టింట వదంతులు స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో తాజాగా ఏఐజీ వైద్యులు శరత్ బాబు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. 

AIG హాస్పిటల్స్ వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. శరత్ బాబు ఆరోగ్యం స్థిరంగానే ఉందని, అలాగే క్లినికల్ స్టేటస్ క్రిటికల్ గానూ ఉందని పేర్కొన్నారు. అయితే ఆయన హెల్త్ పై ఎలాంటి అప్డేట్స్ ను నమ్మొద్దని సూచించారు. శరత్ బాబు కుటుంబ సభ్యులు అయినా, ఏఐజీ ఆస్పత్రి వైద్యులు చెప్పే న్యూసే నమ్మాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. 

శరత్ బాబు తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  1973లోనే నటుడిగా మారి 200కు పైగా చిత్రాల్లో నటించారు. ‘రామరాజ్యం’ అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. నెగిటివ్ రోల్స్ లోనూ మెప్పించారు. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో నటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios