థియేటర్ లో చూసేవాళ్లు లేరు,OTT రైట్స్ కొనేవాళ్లు లేరా?
చాలా చోట్ల థియేటర్‌లో. కరెంట్ ఖర్చులకు అవసరమయ్యే గ్రాస్ అమౌంట్ కూడా రాబట్టలేకపోవడంతో ఈ షోని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందిని తెలుస్తోంది.

ఓ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతోందనగానే ఓటిటి, శాటిలైట్ వంటి రైట్స్ అన్నిఅయ్యిపోతూంటాయి. అయితే క్రేజ్ లేని కొన్ని చిన్న సినిమాలు వీటికి మినహాయింపు. కానీ తెలుసున్న హీరో, పెద్ద బ్యానర్, స్టార్ ప్రొడ్యూసర్ సీన్ లో ఉంటే అది కష్టమూ కాదు. అయితే నిన్న శుక్రవారం రిలీజైన అహింస సినిమాకు తెలుసున్న దర్శకుడు, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఆయన కుమారుడు హీరో కావటం వంటి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఓటిటి మాత్రం కాలేదు అని సమాచారం. ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక పోయన ఈ సినిమాని...ఏదో ఒక పెద్ద సినిమా అడ్డం పెట్టి ఓటిటి బిజినెస్ చేస్తారంటోంది ట్రేడ్. మరో ప్రక్క ఇదే సినిమాతో పాటు రిలీజైన పరేషాన్ సినిమా ఓటిటి రైట్స్ మాత్రం సోనీ లివ్ సొంతం చేసుకోవటం జరిగింది. దాంతో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఇక అహింస టీజర్, ట్రైలర్ లోనే ఇది ఒక రొటీన్ సినిమా అని జనాలకి అర్దమైంది. దీంతో సినిమాలో అసలు ఏం లేదని అందరికీ అర్థమైపోయింది. చాలా చాలా చోట్ల ఓపినింగ్స్ లేవు. అసలే ఎండలు. మరో ప్రక్క సినిమాపై ఆసక్తి లేకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. చాలా చోట్ల థియేటర్‌లో. కరెంట్ ఖర్చులకు అవసరమయ్యే గ్రాస్ అమౌంట్ కూడా రాబట్టలేకపోవడంతో ఈ షోని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందిని తెలుస్తోంది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి రోజు కనీసం 50 లక్షలు కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఈ సినిమా నిర్మాత జెమినీ కిరణ్ కు 4 కోట్లు ఖర్చయింది.షాడో ప్రొడ్యూసర్ గా సురేష్ బాబు వెనక నుంచి పెట్టుబడి పెట్టాడు అంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించి రిలీజ్ చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఈూ కుర్రాడితో ఇంకా సినిమాలు నిర్మిస్తారో లేదో అనే సందేహం సినీ వర్గాల వారికి కలుగుతోంది.