కరోనా సెకండ్ వేవ్ కారణంగా జనాలు ఇంటి నుంచి బయటకు రావాడానికి బయపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆల్రెడీ థియేటర్స్ లోకి వచ్చిన పలు చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా ఓటీటీ లో ప్రత్యక్ష్యమైంది. ఈ చిత్రం మే 30 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.  థియేటర్‌ రన్ అయ్యిపోవటంతో ఎగ్రిమెంట్ డేట్ కన్నా ముందుగానే స్ట్రీమింగ్ మొదలైంది. టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీలతో చేసుకున్న ఒప్పందం మేరకు సినిమా థియేట్రికల్ విడుదలకు, ఓటీటీ విడుదలకు మధ్య కనీసం నెలన్నర గ్యాప్ ఉండాలి.. అనేదీ ఓ కండీషన్. కానీ 'వకీల్ సాబ్' విషయంలో ఇది పాటించలేదు.

 చిత్రం విడుదలై నెలరోజులు కూడ గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది. అంటే ఏప్రియల్ 30 నుంచే అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. అయితే అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం కేవలం భారతీయ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కానీ ఓవర్సీస్ ఆడియెన్స్ కి మాత్రం ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో లేదు.   ఇప్పుడు  స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇది వారికి ఎక్స్ క్లూజివ్ వెర్షన్ అని తెలుస్తోంది. 

ఇక హిందీ ‘పింక్’ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెలుగుకు అనుగుణంగా మార్పులు చేశారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానిలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో మగువ మగువ సాంగ్ మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సినిమాలో అంజలీ, అనన్య, నివేద థామస్ కీలక పాత్రలో నటించారు. శృతిహాసన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ స్టైల్ కు ఆయన చెప్పిన డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కు ఈ సినిమా పర్ఫెక్ట్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ పోషించిన నంద పాత్ర సినిమాకు మరో హైలైట్ అనే చెప్పాలి.