తెలుగు ఓటీటీ మాధ్యమం `ఆహా`కి గూగుల్‌ పెద్ద షాకిచ్చింది. మూడేళ్ల గడువు ఇచ్చినా ఆ పనిచేయకోవడంతో చేసేదేం లేక దాన్ని డిలీట్‌ చేసింది.  

పాపులర్‌ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` తెలుగు స్టేట్స్ లో ఇది దూసుకుపోతుంది. నిర్మాత అల్లు అరవింద్‌, మై హోమ్‌ అధినేత రామేశ్వర్‌ రావు కలిసి ఈ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ మధ్యమాన్ని ప్రారంభించారు. అమెజాన్‌, నెట్‌ ఫ్లిక్స్, జీ వంటి పాపులర్‌ సంస్థలు ఓటీటీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో `ఆహా` కూడా ఓటీటీ ని స్టార్ట్ చేశారు. కరోనా సమయంలో దీన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందే దీన్ని స్టార్ట్ చేయగా, పెద్దగా ఆదరణ రాలేదు. కరోనా సమయంలో ఇంట్లో నుంచేసినిమాలు, షోస్‌ చూసే అలవాటు పెరిగిన నేపథ్యంలో అల్లు అరవింద్‌ తన కంట్రోల్‌లోకి తీసుకుని దీన్ని డెవలప్‌ చేశాడు. 

సినిమాలను స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించాడు. చిన్న సినిమాలతో స్టార్ట్ చేశారు. షోస్‌ చేశారు. అలాగే ఓల్డ్ మూవీస్‌ని స్ట్రీమింగ్‌ చేశారు. అది క్లిక్‌ కావడంతో కొత్త సినిమాలను కూడా కొని స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు తెలుగులో దుమ్ములేపుతుంది. దీన్ని తమిళంలోనూ రన్‌ చేస్తున్నారు. సినిమాలతోపాటు షోస్‌ కూడా చేస్తూ మరింత క్రేజ్‌ని పెంచుతున్నారు. సమంతతో `సామ్‌ జామ్‌` అనే షో ప్రారంభించారు. అది బాగా ఆదరణ పొందింది. సెలబ్రిటీలు కూడా భారీగానే హాజరయ్యారు. 

ఆ తర్వాత బాలకృష్ణతో `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` షో ప్రారంభించారు. ఇది `ఆహా` రేంజ్‌ని మార్చేసింది. ఈ షో ఇండియాలోనే బెస్ట్ షోగా నిలిచింది. అత్యంత రేటింగ్‌ సాధించిన షోగా నిలిచింది. దీంతోపాటు పెద్ద స్టార్‌ హీరోల సినిమాలను కూడా `ఆహా`లోనే స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. మొత్తంగా ఆహా స్థాయి పెరిగింది. అయితే సడెన్‌గా ఇప్పుడు `ఆహా`కి గూగుల్‌ పెద్ద షాకివ్వడం విశేషం. గూగుల్‌ నుంచి దీన్ని తీసేసింది. ప్లే స్టోర్‌ నుంచి డిలీట్‌ చేసిందట. 

మరి ఎందుకు డిలీట్‌ చేయాల్సి వచ్చింది, గూగుల్‌తో ఆహాకి గొడవేంటనేది చూస్తే.. ఇటీవల గూగుల్‌ అన్ని యాప్స్ కి ఫీజ్‌పెంచింది. దాన్ని కొనే రేట్‌ 11 శాతం నుంచి 26 శాతం పెంచింది. కానీ ఆహా టీమ్‌ ఈ మొత్తాన్ని కొనేందుకు నిరాసక్తి చూపించారు. దాదాపు మూడేళ్లు గడువు ఇచ్చినా ఇంకా చెల్లించలేదు. దీంతో చివరికి చేసేదేం లేక ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ ని డిలీట్‌ చేశారట. ఇకపై కొత్తగా ఈ యాప్‌ని డౌన్‌ లోడ్‌ చేసుకునే అవకాశం లేదు. ఇది ఆహాకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చాలా మంది దీన్ని డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. లక్షల సబ్‌ స్క్రిప్షన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆహా టీమ్‌ ఏం చేయబోతుందో చూడాలి.