Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: నిఖిల్ '18 పేజెస్' ఓటిటి డేట్ ఫిక్స్ !

 అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా న‌టించింది. జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై బ‌న్నీవాస్ (BunnyVas) ఈ సినిమాను నిర్మించారు.  ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఆహా, నెట్ ప్లిక్స్ రెండింటిలోనూ స్ట్రీమింగ్ కానుంది. 

Aha gives an official confirmation about the OTT release of 18 Pages
Author
First Published Jan 20, 2023, 12:42 PM IST

నిఖిల్ (Nikhil), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 22న రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ క‌థ‌ను అందించిన ఈ సినిమాకు సూర్య ప్ర‌తాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 18 పేజెస్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా, కమర్షియల్ గా అనుకున్న స్దాయిలో పే చెయ్యలేదు. అయితే ఈ చిత్రాన్ని చాలా మంది ఓటిటిలో చూడాలని వెయిట్ చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం ఓటిటి ప్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యాయి. ఆ వివరాలు ఆహా అఫీషియల్ గా ప్రకటించింది.  

 
సుకుమార్ కు కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ ప్రేమ కథలు అందించే దర్శకుడుగా పేరుంది. దాంతో ఆయన రైటింగ్ లో వచ్చిన  ‘18పేజెస్‌’అనగానే ఓ విధమైన క్యూరియాసిటీ  కలిగింది. అందులోనూ సూపర్ హిట్ చిత్రం కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్ర‌తాప్ ప‌ల్నాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా న‌టించింది. జీఏ2 పిక్చ‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప‌తాకాల‌పై బ‌న్నీవాస్ (BunnyVas) ఈ సినిమాను నిర్మించారు.  ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా ఆహా, నెట్ ప్లిక్స్ రెండింటిలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని  జనవరి 27 నుంచి ఈ రెండు ఓటిటీలలో చూడవచ్చు.

 చిత్రం కథేమిటంటే.. యాప్స్ డవలప్ చేసే  సిద్ధు( నిఖిల్) ఓ ఈ కాలం యూత్ కు ప్రతినిధి.   ప్రీతీ అనే అమ్మాయిని ప్రేమలో ఉండి తర్వాత తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఆ బాధలో బ్రేకప్ లో పాటలు పాడుకుంటూండా.... అనుకోకుండా సిద్దుకు రోడ్డు పక్కన  ఒక రోజు డైరీ దొరుకుతుంది. ఆసక్తిగా దాన్ని తిరగేస్తే అది..నందిని(అనుపమ పరమేశ్వరన్‌)రాసింది అని తెలుస్తుంది.   ఆ డైరీలోని ఒక్కోపేజీ చదువుకుంటూ వెళుతూ, ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు… ఆమె ప్రతి అలవాటునూ తనదిగా మార్చేసుకుంటాడు. రెండేళ్ళ క్రితం ఆ డైరీలో జరిగిన ఇన్సిడెంట్స్ ను ప్రస్తుత కాలానికి అన్వయించుకుంటూ ఇబ్బందిపడుతూంటాడు. అయితే 2019 నాటి ఆ డైరీలో 18 పేజీల తర్వాత ఆగిపోవటం చూసి అవాక్కవుతాడు. నందినిని వెతుక్కుంటూ ఆమె గ్రామానికి బయిలుదేరతాడు.   
        
అక్కడ రెండేళ్ళ క్రితం ఆమె హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో చనిపోయిందని నాయనమ్మ చెప్తుంది. తాతగారిచ్చిన కవరు హైదరాబాద్ లో వెంకట్రావుకి అందజేయడానికి వెళ్ళి మరణించింది. దీంతో తన ప్రేమ బలంతో ఆమె బ్రతికే వుందని నమ్మిన సిద్ధార్థ్ ఆమెని వెతకడం ప్రారంభిస్తాడు.   ఆమె చేసిన మంచి పనులను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాడు. ఆ క్రమంలో నందిని గురించి మరిన్ని విషయాలు రివీల్ అవుతాయి.  అవేమిటి...సిద్ధార్థ్‌ నమ్మినట్టు నందిని బ్రతికే ఉందా? బ్రతికి ఉంటే ఆమెను అతను కలిగాడా?ఆ డైరీలో అసలు ఏముంది?   సిద్ధు నందినిని లైవ్ లో కలిసి ప్రపోజ్ చేసాడా? సిద్ధు ప్రేమ ఫలిచిందా ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios