Akhanda:“అఖండ” చూడటానికి ఆఘోరాలు,ఏ ధియోటర్ లో నంటే...
సినిమాకు వచ్చిన అఘోరాలు.. బాలయ్య అభిమానులతో కాసేపు ముట్టించారు. ఆ తరువాత అఖండ సినిమాను చూసి.. ఆనందించారు. ఈ సినిమా కోసమే థియేటర్‌కు వచ్చామంటూ చెప్పారు.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మార్నింగ్ షోకే హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోతున్నాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో సందడిగా నెలకొంటొంది. బాలయ్య ని బోయపాటి చూపించిన నెక్స్ట్ లెవెల్ మాస్ ప్రెజెంటేషన్ లో తనకి తానే సాటి అని మళ్ళీ ప్రూవ్ చేశారు.
రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఈ సినిమాని కేవలం అభిమానులే కాదు కొందరు అఘోరాలు సినిమా చూసేందుకు వచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో సందడి చేశారు. అఘోరాలూ కూడా బాలయ్య ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు కేకలేశారు.
ఇక సినిమాకు వచ్చిన అఘోరాలు.. బాలయ్య అభిమానులతో కాసేపు ముట్టించారు. ఆ తరువాత అఖండ సినిమాను చూసి.. ఆనందించారు. ఈ సినిమా కోసమే థియేటర్‌కు వచ్చామంటూ చెప్పారు. అభిమానులతో కలిసి శివనామస్మరణ చేశారు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అఘోరాలు అఖండ సినిమా చూడ్డానికి రావడం చూసి బాలయ్య హార్డ్ కోర్ అభిమానులు ఫుల్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య పవర్ అంటే అదే అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నిత్యం శివ నామస్మరణ చేసే అఘోరాలు.. బాలయ్య సినిమాకు రావడం.. ఆయనను వారు ఆశీర్వదించడమేనని అంటున్నారు. బాలయ్యకు ఇప్పటికీ ఎప్పటికీ తిరుగేలేదని.. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.