అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఆశలన్నీ.. ఏజంట్ సినిమాపైనే ఉన్నాయి. ఈసారి హిట్ కొడితే.. కెరీర్ కు తిరుగుండదు.. లేకపోతే అక్కినేని హీరో కెరీర్ డేంజర్ లో పడినట్టే.. ఈక్రమంలో ఏజంట్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈమూవీపై మీడియా మీట్ పెట్టారు టీమ్.
అక్కినేని వారి వారసుడు .. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా రూపొందింది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా ద్వారా సాక్షీ వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతోంది. చాలా కాలం క్రితం స్టార్ట్ అయిన ఈసినిమా.. ఎన్నో అవాంతరాలు దాటుకుని.. షూటింగ్ ముగించుకుని.. మరోసారి కొన్ని రీషూట్లు చేసుకుని.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నెల 28 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఏజంట్ సినిమా. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దర్శక నిత్మతలతో పాటు అఖిల్ .. సాక్షి వైద్య ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ .. కొన్ని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా కోసం అందరి కంటే ఎక్కువగా అఖిల్ కష్టపడడ్డాడు. సినిమా కంప్లీట్ అవ్వడానికి చాలా ఆలస్యం అయ్యింది అయినా సరే అఖిల్ అప్పటి వరకూ వర్కౌట్స్ మానలేదు. ఎంతో కష్టపడి అదే సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తూ వచ్చాడు. అఖిల్ అన్నీ చేయగలడు .. ఆయనకి ఉన్న టాలెంట్, ఎనర్జీ నేను కళ్లారా చూశాను.. అఖిల్ ఎనర్జీలో నేను వాడింది 50 పర్సంట్ మాత్రమే... అఖిల్ చేయగలిగింది చాలా ఉంది అన్నారు.
ఇక ఈ సినిమాలో సాక్షి వైద్యను ఇన్ స్టాలో చూసి సెలెక్ట్ చేశాము. ఆమె కొత్త హీరోయిన్ అన్నట్ట అసలే ఉండదు. సినిమా కోసం తను చాలా కష్టపడింది. ఆమె ఇంతవరకూ ఏ సినిమాలో చేయలేదు. నేరుగా సెట్ కి వచ్చి చెప్పింది చేసేది అంతే. ఇక ఒక్కోసారి అనుకున్న అవుట్ పుట్ రాబట్టడానికి ఆమెను తిట్టవలసి వచ్చింది. కాని తాను అర్ధం చేసుకుంది కాబట్టి నిలబడగలిగింది. అప్పుడే నాకు అర్ధం అయ్యింది తనకి మంచి ఫ్యూచర్ ఉందని అన్నారు సురేందర్ రెడ్డి.
ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఓ పాత్రలో కనిపించారు. అటువంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు సురేందర్ రెడ్డి. ఇక ఏజంట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్.. ఈసినిమాలో రా ఏజంట్ గా కనిపించనున్నాడు. రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో.. సిక్ ఫ్యాక్ లో భారీ దేహంతో అఖిల్ కనిపించబోతున్నాడు.
ఇప్పటికే రిలీజ్ అయిన అఖిల్ లుక్స్ చూసి.. అక్కినేని ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అఖిల్ బీస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈసినిమాతో అఖిల్ తిరుగులేని క్రేజ్ సాధిస్తాడు అని నమ్మకంతో ఉన్నాడు. అంతే కాదు ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో.. 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈసారి ఈసినిమాతో అయినా..అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా చూడాలి మరి.
