ఈ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి


 కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా మిగిలిన సినిమాలేవీ సక్సెస్ సాధించలేదు. దీంతో అఖిల్ ఈ సినిమాపై పూర్తి నమ్మకం, ఆశలు పెట్టుకున్నాడు. స్టైలిష్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో ఏజెంట్ సినిమాకు మంచి క్రేజే క్రియేట్ అయ్యింది. ప్రోమోలు, పోస్టల్ లు చూసిన వారు ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని చెప్తున్నారు. ఇంతకీ ఈ చిత్రం బడ్జెట్ ఎంత 

ఈ సినిమా బడ్జెట్ మొదట 50 కోట్లు అయింది అని ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాల కోసం రీషుట్ల కారణంగా మరో 20 కోట్లు ఖర్చు చేశారు అనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సినిమాకు బిజినెస్ కూడా సరిగ్గా జరగడం లేదు అని కూడా కథనాలు వెలువడ్డాయి. నిర్మాత అనీల్ సుంకర ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఏజెంట్ సినిమా కోసం అనుకున్న ప్లాన్ ప్రకారమే ఖర్చు అయింది అని మధ్యలో కోవిడ్ రావడం కారణంగా మరొక కొంత ఖర్చయింది అని అన్నారు. మొత్తంగా అయితే ఏజెంట్ సినిమా కోసం 80 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా చెప్పారు. 

అయితే అఖిల్ కు అంత మార్కెట్ ఉందా అనేది సమస్య. అతని మార్కెట్ రేంజ్ 30 కోట్ల వరకు ఉండొచ్చు. అయితే ఏజెంట్ మూవీ కంటెంట్ మీద నమ్మకంతో సురేందర్ రెడ్డి ఏకంగా భారీస్థాయిలో ఖర్చు చేశారని చెప్తున్నారు. కానీ 50 కోట్లు రిస్కే. కానీ డిజిటల్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ వచ్చాక ఆ రిస్క్ దాదాపు తగ్గిపోయిందనేది నిజం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈచిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఏప్రిల్ 18న ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. 

ఈ మూవీ రన్‌టైమ్‌ను 2 గంటల 32 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్. ఫైనల్ కట్‌లో ఈ రన్‌టైమ్ 2 గంటల 30 నిమిషాలుగా ఉంటుందని ఏజెంట్ టీమ్ చెబుతోంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ చేసిన డేరింగ్ స్టంట్స్ ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేస్తాయని వారు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాలో ఏజెంట్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.