సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్లు అంటూ చాలానే వార్తలు వస్తుంటాయి. అయితే టాలీవుడ్ లో ఇలాంటి వార్తలు అరుదుగా వినిపిస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో నడుపుతున్న ప్రేమాయణం వెలుగులోకి వచ్చింది. సదరు నటుడు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి. 

అతడి తల్లి డెబ్బైలలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు హీరోగా కొన్ని సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు తండ్రి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

వ్యక్తిగతంగా చూసుకుంటే ఇతడు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ఎఫైర్ సాగిస్తున్నాడని టాక్. ఆమె తెలుగు  సినిమాల్లో మంచి పేరే తెచ్చుకుంది. తల్లి పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటుంది. చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాలలో నటించారు. 

ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని సమాచారం. సదరు నటి ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా.. ఈ సీనియర్ నటుడి ఇంట్లోనే ఉంటుందట. మొత్తానికి ఈ జంట వారి మధ్య బంధాన్ని బాగానే పెంచుకుంటున్నారు.